Saturday, August 22, 2015

శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు .ఆ రాజ్యంలోఅందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది.ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి . ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు .

దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు .
శ్రీలక్ష్మీ ఫలంతో సిరి సంపదలు 
శ్రీలక్ష్మీ ఫలం అంటే చాలామందికి తెలీదు. ఇది పెద్ద ఉసిరికాయ సైజులో ఉంటుంది.ఆకారంలో కొబ్బరికాయను పోలి ఉంటుంది. రంగు మాత్రం బూడిదరంగు. ఆకృతిలో చిన్నగా ఉన్నప్పటికీ, శ్రీలక్ష్మీ ఫలానికి కొబ్బరికాయ మాదిరిగానే పీచు ఉంటుంది. నారికేళానికి ఉన్నట్టే కళ్ళు ఉంటాయి. శ్రీలక్ష్మీ ఫలం కళ్ళను "బిరుదులు" అంటారు. శ్రీలక్ష్మీ ఫలాలు సముద్ర తీరప్రాంతంలో మాత్రమే దొరుకుతాయి. ఇవి లక్ష్మీదేవికి చాలా ప్రియమైనవి.

శ్రీలక్ష్మీ ఫలం సేకరించి, ఇంట్లో ఉంచుకుంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లే. శ్రీ మహాలక్ష్మి పుట్టింది సాగరంలో. శ్రీలక్ష్మీ ఫలాలు అంకురించేదీ సముద్రంలోనే. లక్ష్మీదేవికీ, శ్రీలక్ష్మీ ఫలాలకూ అవినాభావ సంబంధం ఉంది. వీటిని పూజామందిరంలో ఉంచుకుంటే సర్వ శుభాలూ చేకూరుతాయి. సిరిసంపదలకు కొదవ ఉండదు.

శ్రీలక్ష్మీ ఫలాన్ని మన ఇష్టం వచ్చినట్టుగా ఎప్పుడో ఒకప్పుడు పూజించకూడదు. గురువారం లేదా ఏదైనా పర్వదినం రోజున మొదలుపెట్టాలి.

శ్రీలక్ష్మీ ఫలంతో పూజ మొదలుపెట్టే రోజున పొద్దున్నే లేచి, స్నానపానాది కార్యక్రమాలు ముగిసిన తర్వాత శ్రీలక్ష్మీ ఫలాన్ని "శుద్ధోదక జలంతో కడగాలి. పూజకు కేటాయించిన పీటను శుభ్రపరిచి పసుపు రాయాలి. దానిమీద కొత్త వస్త్రం పరిచి దానిమీద శ్రీలక్ష్మీ ఫలాన్ని ఉంచాలి. దానికి చందనం అద్ది, కుంకుమబొట్టు పెట్టాలి. కొన్ని నాణాలు, అక్షింతలు, కొద్దిగా పసుపు, కుంకుమ, కర్పూరం శ్రీలక్ష్మీ ఫలం ముందు ఉంచాలి.

పైన చెప్పిన ప్రకారం శ్రీలక్ష్మీ ఫలాన్ని పూజామందిరంలో పీఠం మీద ప్రతిష్ఠించి, అక్షింతలు, నాణాలు ఉంచిన తర్వాత "ఓం శ్రీం శ్రియై నమః" అంటూ పూజించాలి.
లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసముంటే ఎలాంటి

ఫలితం ?




మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి. ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారు ఉండరు. అయితే ఆ తల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు. కాబట్టే పెద్దలు మానవశరీరంలో ఆ తల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలొస్తాయో సంకేత రూపంలో తెలియజేశారు. ఈవిషయాన్నే జ్యోతిషశాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.
అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆ మానవులకు పెద్దపెద్దభంతులు, విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.
తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.
గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం సాంసారిక ఆనందం లభిస్తుంది
రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి.
కంఠభాగంలో ఆతల్లి తేజస్సు ఉన్నప్పుడు ఆభరణ ప్రాప్తి కలుగుతుంది
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్దే కాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి, మధురమైన కవితా శక్తి పాండిత్యము లభిస్తాయి


what are the benifits if Goddess Lakshmi stays in different places in your body



ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...! వాని దగ్గర నిలబడదు. వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలినతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు బోధించి వున్నారు.
జ్యోతిషరీత్యా పరిశీలిస్తే లక్ష్మీ దేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారంతో పై సంకేతాలు ఖచ్చితంగా సరిపోలుతున్నాయి అని జ్యోతిషకారులు చెబుతున్నారు.
జగన్మాత అయిన ఆ తల్లి కృప హఠాత్తుగానో, పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. పూర్వజన్మలో మనం చేసిన సత్కర్మలో, ఇప్పటి సద్వర్తనమో, మనతల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు. సంపదలను అనుగ్రహించే ఆ తల్లి ఆ సంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది. ఆ డబ్బు చేరటంతో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసులలాగానే ఎప్పుడొ ఏమరుపాటున ఆ తల్లిని తలపైకెక్కించుకుని [కళ్ళుకూడా అక్కడేఉంటాయనే పెద్దలు కల్లునెత్తికెక్కాయిరా అని తిట్టేది] కానిపనులు చేసి కష్టాలపాలు కాకూడదు. అమ్మదయతో చేరిన ఆ ధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ధర్మ, కామ, మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి.

లక్ష్మీదేవి కటాక్షం కోసం రోజుకు మూడుసార్లు ...


Kanakadhara Stotra is one among many gems written by Shri Adi Shankara, a Hindu philosopher of the Advaita Vedanta system with meanings


అజ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
భృంగాగనేవ ముకుళాభరణం తమాలం
అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా
మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః

మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడుతుమ్మెదలు ఆభరణమైనట్లు, పులకాంకురముల తోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినదియు, సకల ఐశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క క్రీగంటిచూపు నాకు శుభములు ప్రసాదించు గాక!

ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః

పెద్దనల్లకలువపై నుండు ఆడు తుమ్మె దవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక!

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక 

భాహ్యాంతరే మధుజిథ శ్రితికౌస్తుభే య
హరావలీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయః

భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయఅగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక 

కాలంబుదాలి లలితోరసి కైటభారే:
దారా ధరేసురటి యా తటిజ్గనేవ
మాతుస్సమస్త జగతాం మహనీయ మూర్తి:
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక
ప్రాప్తం పదం ప్రధమతఃఖలు యత్ప్రభావాత్
మాజ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్థం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః

ఏ క్రీగంటి ప్రభావమున మన్మథుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ది కన్య అగు లక్ష్మీదేవి యొక్క మండమగు నిరేక్షము నాయందు ప్రసరించుగాక 

విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష
మానందహేతు రధికం మురవిద్విషోపి
ఈషన్నిషీదతు మయిక్షణ మీక్షణార్థ
మిందీవరోదర సహోదర మిందిరాయాః

సమస్త దేవేంద్ర పదవినీయగలదియు, విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము నాపై నిలిచియుండునుగాక!


Kanakadhara Stotra is one among many gems written by Shri Adi Shankara, a Hindu philosopher of the Advaita Vedanta system with meanings


ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః

పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్థ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక 

దద్యాయానుపవనో ద్రవిణాంబుధారా
మస్మిన్నకించన విహంగశిసౌ విషణ్ణే
దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక

గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టిస్థితి ప్రళయకేళిషు సంస్థితాయై
తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యైః

వాగ్దేవత (సరస్వతి) అనియు, గరుఢధ్వజ సుందరి అనియు, శాకం బరియనియు, శశిశేఖర వలభాయనియు పేరు పొందినదియు, సృష్టిస్థితిలయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కారము.

ఆ మీలితాక్ష మధిగమ్య  ముదా ముకుందం
ఆనందకంద మనిమేష మనజ్గ తంత్రం
అకేకర స్థిత కనీనిక పష్మనేత్రం
భూత్యై భవే నమ్మ భుజజ్గ శయాజ్గనాయాః

నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, రెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, రెప్పలునుగలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగునుగాక 

శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై

పుణ్య కార్యముల ఫలమునొసగు శ్రుతిరూపిణియు, సౌందర్యగుణ సము ద్రయగు రతిరూపిణియును, పద్మనివాసియగు శక్తిరూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై

పద్మమును పోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని-అమృతమునకును తోబుట్టువును, నారాయణుని వల్లభయునగు లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్గ్ఙయుధ వల్లభాయై

బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయికయైనదియును, దేవతలలోదయమే ముఖ్యముగా గలదియును, విష్ణువుకు ప్రియురాలునుయైన లక్ష్మీదేవికి నమస్కారము.


Kanakadhara Stotra is one among many gems written by Shri Adi Shankara, a Hindu philosopher of the Advaita Vedanta system with meanings


నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై

భృగుమహర్షి పుత్రికయును, విష్ణు వక్ష:స్థలవాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
నమోస్తు దేవాదిభి రర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై

తామరపువ్వులవంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలునగు లక్ష్మీదేవికి నమస్కా రము.

సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితా హరణోద్యతాని
మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

పద్మములవంటి కన్నులగల పూజ్యురాలవగు నోయమ్మా! నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదలు కలగించునవి, చక్రవర్తిత్వము నొసగగలవి, పాపములను నశింపచేయునవి. ఓ తల్లి అవి ఎల్లప్పుడును నన్ను అనుగ్రహించుగాక!

యత్కటాక్ష సముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసైః
త్వాం మురారి హృదయేశ్వరీం భజే

ఏదేవియొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరియగు లక్ష్మీదేవిని... నిన్ను మనో వాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును.

సరసిజనయనే సరోజ హస్తే
ధవళతరాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువన భూతి కరి ప్రసీద మహ్యం

కమలముల వంటి కన్నులు గల ఓ తల్లి చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ! విష్ణుప్రియా!, మనోజ్ఞులారా!, ముల్లోకములకు సంపదను ప్రసాదించు మాతా! నన్ననుగ్రహింపుము.

దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాంగీం
ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధి పుత్రీం

దిగ్గజములు కనకపు కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించ బడిన శరీరము గలదియు, లోకములకు జననియు, విశ్వ్రపభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియునగు లక్ష్మీదేవికి నమస్కరించుచున్నాను.

కమలే కమలాక్ష వల్లబే త్వం
కరుణాపూర తరంగితై రపాంగైః
అవలోకయ మా మకించనానాం
ప్రథమం పాత్రమ కృత్రిమం దయాయాః

శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి! దరిద్రులలో ప్రథమస్థానంలో ఉన్నాను. నీ దయకు తగిన పాత్రమును అగునన్ను నీ కరుణా కటాక్షముతో చూడుము.

స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
గుణాధికా గురుతర భాగ్యభాజినో
భవంతి తే భువి బుధ భావితాశయాః

ఎవరీ స్తోతములచే ప్రతిదినమును వేద రూపిణియు, త్రిలోక మాతమునగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు.

సువర్ణ ధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితం త్రిసంధ్యం యఃపథేన్నిత్యం స కుబేరసమోభవేత్
ఆదిశంకరాచార్యులు రచించిన కనక ధారాస్తోత్రమును ప్రతిదినము త్రికాలమందు పఠించువారు కుబేరునితో సమానులగును.

లక్ష్మీదేవి గురించి మీకు తెలుసా?


All about the Hindu deity Lakshmi - the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.


హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్


త్రిమూర్తులలో ఒకరయిన మహావిష్ణువు భార్య ... లక్ష్మిదేవి. చాలా మంది దేవతలకు ఉన్నట్టే లక్ష్మిదేవికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం, సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్రరాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర. మహాలక్ష్మి సిరిసంపదలకు అధిదేవత. జీవన సౌభాగ్యానికి దివ్యప్రతీక. సృష్టికి కారణభూతమైన ఆద్యపరాశక్తిని మన ప్రాచీన మహాద్రష్టలు సుమనోజ్ఞరూపాల్లో చిత్రించి ఆరాధించారు. ఆ శక్తి మహిమలను, దివ్యత్వ శోభలను అనేక దేవతామూర్తులుగా మలచారు. ప్రతిరూపం ఒక దివ్యసంకేతం. ప్రతి సంకేతం వెనక ఒక రహస్య సందేశం కనిపిస్తుంది.


All about the Hindu deity Lakshmi - the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.


మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి హిరణ్యవర్ణంలో భాసించే మధురమోహనమూర్తి. ఆమె చతుర్భుజాలతో పూర్ణవికసితపద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గరూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆరోగ్యప్రదమైన ఆర్థిక వ్యవస్థ వెనక కీలక రహస్యం చలామణీ.


All about the Hindu deity Lakshmi - the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.


జాజ్వల్యమానమైన శ్రీలక్ష్మీదేవి అతిలోక తేజస్సును, సుసంపన్నతను ప్రసరిస్తూ ఉంటుంది. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి ధర్మార్థకామమోక్షాలు. జననమరణాల చక్రంనుంచి మనిషిని విముక్తి చేసి ఆమె మహాసత్యంవైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి ఆకుపచ్చని చీర ధరిస్తుంది. అది అభివ్యక్త శక్తికి, వికాసానికి, సారభూతమైన భూదేవి పచ్చదనానికి సంకేతం. అప్పుడప్పుడు ఆమె ధరించే ఎర్రని చీర రంగు- కార్యశీలతకు, అంతశ్శక్తికి ప్రతీక. లక్ష్మీదేవికి ఇరువైపులా రెండు శ్వేతగజాలు నిలబడి నీటిని చిమ్ముతూఉంటాయి.


All about the Hindu deity Lakshmi - the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.

తన ధర్మాన్ని అనుసరించి వివేకంతో, నిర్మల మనస్సుతో, ఐహిక, ఆధ్యాత్మిక సంపదల కోసం నిరంతరాయంగా చేసే ప్రయత్నానికి అది సంకేతం. మహాలక్ష్మి చెంతనే ఒక తెల్లగుడ్లగూబ కనిపిస్తుంది. దీని వెనక రెండు సంకేతార్థాలు ఉన్నాయి. ఒక ప్రతీకకు అర్థం వివేకం, అదృష్టం. మరొక సంకేతార్థం తెలివిహీనత. సంపద తెలివిహీనుల గర్వం, అహంకారం కారణంగా మాయమవుతుంది. అందువల్లనే లక్ష్మిని చంచల అన్నారు. లక్ష్మికి ఒక సోదరి ఉంది. ఆమె పేరు అలక్ష్మి. ఆమె దురదృష్టానికి హేతువు. ధన నియమాలు పాటించకపోతే కలిగే దుస్థితి అది. లక్ష్మి అనే పదం సంస్కృత పదం లక్ష్యం నుంచి వచ్చింది. విస్పష్టమైన జీవన లక్ష్యం ఉన్నవారి చెంత లక్ష్మి సుస్థిరంగా ఉంటుంది. 


All about the Hindu deity Lakshmi - the goddess of prosperity, wealth, purity, generosity, and the embodiment of beauty, grace and charm.


లక్ష్మీ పూజకు సాయంసమయం అనువైనది. పరిశుభ్రంగా ఉన్న ఇంటిలోకి మాత్రమే ఆమె ప్రవేశిస్తుందని నమ్మకం. మనస్సు, ఆత్మ సామరస్య, సౌందర్య ప్రాభవంతో వెలుగుతున్నచోట, ఆలోచనలు, సంవేదనలు, సామరస్య సౌందర్యమాధుర్యాలతో విలసిల్లేచోట- జీవితం, పరిసరాలు, కదలికలు, మన బాహ్య చర్యలు అతిలోక రమణీయకతతో శోభిల్లినప్పడు శ్రీమహాలక్ష్మి శాశ్వతంగా ఉండిపోతుందని చెబుతారు. ఆమె అడుగుపెట్టినచోట అద్భుతావహ ఆనంద స్రవంతులు పొంగిప్రవహిస్తాయి. శ్రీమహాలక్ష్మి సిరిసంపదలతోపాటు జీవితాన్ని భగవదానంద ప్రదీప్తం చేస్తుంది. సంతోషంలేని సంపదలు దేనికి? ఆమెను మనసారా ఆరాధిస్తే జీవితం అతి మనోహరకళాఖండంగా ప్రకాశిస్తుంది. పవిత్ర ఆనంద సుధామయమంత్రగీతమై రవళిస్తుంది. మన వివేకాన్ని మహదాశ్చర్య శిఖరాలపై నిలుపుతుంది ఆమె. సమస్త జ్ఞానాన్ని అధిగమించే ఆనందపు అంతర్నిక్షిప్త రహస్యాలు ఆమె మనకు సమావిష్కరిస్తుంది. అపార విశ్వాసం, భక్తిప్రపత్తులు కలిగినవారి దృస్టిలో శ్రీమహాలక్ష్మి సిరిసంపదలు అనుగ్రహించడమే కాదు... వ్యర్థ జీవన చక్ర భ్రమణాన్ని అమృతరసప్లావితంచేసే దేవత!

లక్ష్మీ కటాక్షాన్ని పొందాలంటే ఏం చేయాలి!


Goddess Lakshmi is the Goddess of Wealth. She is widely worshiped by Hindus and devotees try hard to seek her blessings for overall growth, especially to attain wealth. There are some Lakshmi Mantras and Hindu prayers that are very effective. In order to invoke the blessing of Goddess Lakshmi, chant the Lakshmi mantra and pray with certain disciplinary in order to bring wealth and prosperity in your life.


అమృత ప్రాప్తి మంత్రం
చంద్రికే స్వాహా
వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే చంద్రికా యక్షిణీ ప్రసన్నం చెంది అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. కాని ఈ మంత్రం కేవలం అన్నివిధాలా పవిత్రంగా ఉండే మనిషికే వర్తిస్తుంది. అలాంటి వారికే ఫలితం ఉంటుంది.
 


Goddess Lakshmi is the Goddess of Wealth. She is widely worshiped by Hindus and devotees try hard to seek her blessings for overall growth, especially to attain wealth. There are some Lakshmi Mantras and Hindu prayers that are very effective. In order to invoke the blessing of Goddess Lakshmi, chant the Lakshmi mantra and pray with certain disciplinary in order to bring wealth and prosperity in your life.


శంఖినీ యక్షిణీ సాధన మంత్రం
శంఖ ధారడీ శంఖ ధరనే హ్యీం హ్యీం క్లీం శ్రీ స్వాహా

వటవృక్షం క్రింద కూర్చుని పదివేలసార్లు జపించాలి. దీనిని జపించేందుకు ఉదయాత్పూర్వం ప్రారంభించి సూర్యోదయానికి ముందుగానే ముగించాలి. అదే ప్రాంతంలో నెయ్యితో వెయ్యిసార్లు ఈ మంత్రాన్ని హవనం చేస్తే శంఖినీ యక్షిణీ ప్రసన్నం చెంది మీరు కోరుకున్న పదార్థాలను మీకు అందిస్తుంది.

రుణ విముక్తికి చిన్న ఉపాయం


Goddess Lakshmi is the Goddess of Wealth. She is widely worshiped by Hindus and devotees try hard to seek her blessings for overall growth, especially to attain wealth. There are some Lakshmi Mantras and Hindu prayers that are very effective. In order to invoke the blessing of Goddess Lakshmi, chant the Lakshmi mantra and pray with certain disciplinary in order to bring wealth and prosperity in your life.



రుణ సమస్య అనేది చాలా విచిత్రమైన సమస్య. మనిషి ఇందులో కూరుకుపోతే బయటపడటం చాలా కష్టం. ఎవరైతే అప్పుల ఊబిలోనుంచి బయటపడిపోతాడో, అలాంటి వ్యక్తి నిజంగా భాగ్యవంతుడు. దీంతో ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి. దీపావళి పండుగ రోజు ఓ చిన్న ఉపాయాన్ని పాటించి చూడండి.

దీపావళి పండుగరోజు అర్థరాత్రి 12 గంటలకు ఐదు గులాబీ పూలను తీసుకోండి, ఒకటిన్నర మీటరు తెల్లటి వస్త్రాన్ని కొనుక్కొని మీ ముందు పరచుకోండి. ఆ వస్త్రాన్ని నలువైపులా మడుచుకోండి. ఆ తర్వాత ఈ ఐదు గులాబీ పూలను గాయత్రీమంత్రాన్ని పఠిస్తూ ఆ తెల్లటి వస్త్రంలో ఉంచండి. వాటిని భద్రంగా పైన ఉంచండి.

గాయత్రి మంత్రం :


Goddess Lakshmi is the Goddess of Wealth. She is widely worshiped by Hindus and devotees try hard to seek her blessings for overall growth, especially to attain wealth. There are some Lakshmi Mantras and Hindu prayers that are very effective. In order to invoke the blessing of Goddess Lakshmi, chant the Lakshmi mantra and pray with certain disciplinary in order to bring wealth and prosperity in your life.



ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్‌
భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్‌ 


ధన-ధాన్యం మరియు ప్రత్యేకమైన లాభాలను పొందేందుకు:

మంత్రం : ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవసాయ, ధన ధాన్యాధిపతయే ధన ధాన్య సమృద్ధి మేఁ దేహి దాపయ స్వాహా I

ఈ మంత్రాన్ని జపించిన తర్వాత పసుపు రంగులో కలిగిన మిఠాయిలు పిల్లలకు పంచండి. అలాగే గంగాజలాన్ని మీరు పని చేసే చోట చిలకరించండి. ప్రతి రోజు తొమ్మది సార్లు జపిస్తుంటే లక్ష్మీదేవి కృపతో ధనధాన్యాలతో తులతూగుతారు.

ఆకర్షణ వృద్ధి కొరకు


Goddess Lakshmi is the Goddess of Wealth. She is widely worshiped by Hindus and devotees try hard to seek her blessings for overall growth, especially to attain wealth. There are some Lakshmi Mantras and Hindu prayers that are very effective. In order to invoke the blessing of Goddess Lakshmi, chant the Lakshmi mantra and pray with certain disciplinary in order to bring wealth and prosperity in your life.



మీరు పూజ చేసే స్థానంలో బంతిపూవును ఉంచండి. ఆ తర్వాత ఆ పూలును పసుపుతో పూజించండి. ఆ పూలును నీటిలో చిదిముకోండి. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దానిని తిలకంగా దిద్దుకోండి. ప్రత్యేకంగా మీ ఎదుటివారు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. ప్రధానంగా అమ్మాయి లేదా అబ్బాయి వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఇలాంటి ప్రయోగం చేయండి. మంచి ఫలితాలను పొందుతారు.

లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే... ?


We all worship goddess lakshmi, to get wealth and prosperity. lets see ... to please goddess Lakshmi and make her stay longer at your home.


ఒక రోజు రాజు, మంత్రి మారువేషంలోరాజ్యంలో తిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు. రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్తున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు. దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి''నీకు ఏం బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు. కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు. దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని''చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు. అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది. 

We all worship goddess lakshmi, to get wealth and prosperity. lets see ... to please goddess Lakshmi and make her stay longer at your home.



అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టెలకని అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు. ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను. లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి నీ ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామె నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది. అప్పుడు నువ్వామెని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపలవుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.

We all worship goddess lakshmi, to get wealth and prosperity. lets see ... to please goddess Lakshmi and make her stay longer at your home.



ఇంకొకామె పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెని కుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది. ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావ''ని మునీశ్వరుడు చెప్పింది గుర్తుకువస్తుంది. వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోనూ దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది. వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలో శుక్రవారంరోజు ఎవరూ దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు.

We all worship goddess lakshmi, to get wealth and prosperity. lets see ... to please goddess Lakshmi and make her stay longer at your home.



 మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతాశీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయించినందుకు చాలా బాధపడుతూ వుంటుంది. అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది. ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు.

లక్ష్మీదేవి జన్మ, నివాస రహస్యం తెలుసా?


After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story


సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరినవారికి కొంగుబంగారమవుతుంది. లక్ష్మీదేవి పుట్టుక గురించి తెలుసుకోవాలంటే, ఒకరోజు ఇంద్రుడు ఐరావతంపై స్వర్గానికి వెళ్తుండగా, ఎదురుగా దుర్వాస మహర్షి తారసడతాడు. అల్లంతదూరాన ఇంద్రుని చూసిన దుర్వాసుడు, అమరావతి అధిపతికి గౌరవ సూచకంగా తన మెడలోని దండనిస్తాడు. గర్వంతో కళ్ళు మూసుకుపోయిన ఇంద్రుడు, దండ ఇచ్చినదెవరన్న విషయాన్ని పట్టించుకోకుండా, కనీసం కృతజ్ఞతలు చెప్పకుండా, ఆ దండను తన ఏనుగు తొండానికి తగిలిస్తాడు. తొండాన్ని అటు, ఇటు ఆడిస్తున్న ఏనుగు, దండను కిందికి విసిరేసి కాళ్ళతో తొక్కుతుంది. అసలే కోపిష్ఠి అయిన దుర్వాసుడు, ఆ దృశ్యాన్ని చూసి మరింత కోపాద్రిక్తుడై, ‘‘ఓ ఇంద్రా! మితిమించిన అహంకారం, గర్వాతిశయాలతో ప్రవర్తించిన నిన్ను, ఈ భోగభాగ్యాలన్నీ వీడిపోతాయి’’ అని శపించాడు.

After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story



అప్పుడు ఇంద్రుని కళ్ళకు కప్పుకున్న తెరలు తొలగడంతో దుర్వాస మునిని క్షమించమంటూ వేడుకున్నాడు. అది విన్న దుర్వాసుడు, శాపాన్ని అనుభవించక తప్పదని, అయితే విష్ణుమూర్తి కృపతో పూర్వ వైభవాన్ని పొందడం జరుగుతుందని చెప్పాడు. అనంతరం ఇంద్రునిపై దుర్వాసుని శాపం పనిచేయడం ప్రారంభించింది. బలి నాయకత్వంలో రాక్షసులు అమరావతిపై దండెత్తుతారు. ఇంద్రుని, అతని పరివారంతో పాటు స్వర్గం నుండి తరిమేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఇంద్రుడు అజ్ఞాతంగా ఉండిపోయి, తన గురువు బృహస్పతిని సలహా అడుగుతాడు. అందుకు తగిర పరిష్కారాన్ని బ్రహ్మదేవుడే సూచిస్తాడని చెప్పడంతో, ఇంద్రుడు తన పరివారంతో కలిసి వెళ్ళి బ్రహ్మదేవుని ప్రార్థిస్తాడు. అందుకు పరిష్కారాన్ని విష్ణుమూర్తే చెబుతాడని బ్రహ్మదేవుడు పలకడంతో అందరూ  విష్ణుసన్నిధికి చేరుకుంటారు. ఇంద్రాది దేవతల ద్వారా జరిగిన సంగతిని విన్న విష్ణుమూర్తి, రాక్షసుల సాయంతో పాలసముద్రాన్ని చిలికి, అందులోనుంచి వెలువడిన అమృతాన్ని అందుకుంటే తిరిగి అధికారం దక్కుతుందని అంటాడు. మందరపర్వతం, వాసుకితో పాలసముద్రాన్ని చిలకడం మొదలెడతారు.

After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story



విష్ణుమూర్తి కుర్మావతారరూపంలో మందరపర్వతం మునిగిపోకుండా భరిస్తాడు. అనంతరం పాలసముద్రం నుండి ఎన్నోరకాలైన జీవులు, వస్తువులు వెలువడతాయి. అప్పుడే ఓ యువతి కళ్ళు చెదిరే అందంతో, అందెల మృదుమధుర రవళులతో, చేతిలో కలువలమాలతో ఉదయిస్తుంది. ఆమె లక్ష్మీదేవి, ఆమె విష్ణుమూర్తిని తన భర్తగా అంగీకరిస్తూ ఆయన మెడలో మాల వేసి, నును సిగ్గులతో ఆయన సరసన నిలబడుతుంది. అలా క్షీరసాగర మథనం నుంచి జన్మించిన లక్ష్మీదేవి దుష్టశిక్షణార్థం మహావిష్ణువు ఎత్తిన అవతారాలన్నింటిలోనూ ఆయన సరసనే ఉంటుంది.

చంచల స్వరూపిణి...


After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story



లక్ష్మీదేవి ఒకచోట స్థిరంగా ఉండదనేది జగమెరిగిన సత్యమే. గర్విష్ఠులు, ఈర్ష్యాద్వేష పూరితుల ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండదనడానికి దుర్యోధనుని ఉదంతమే ప్రబల ఉదాహరణ. ఒకరోజు తన తండ్రి ధృతరాష్ట్రుని ముందు నిలిచిన దుర్యోధనుడు, పాండవాదులపట్ల తనకు గల అక్కసునంతా వెళ్ళగక్కుతాడు. పాండవులు సంపదల మధ్య తులతూగిపోతున్నారనీ, లెక్కలేనంత మంది భృత్యులతో, రాజప్రాసాదాలతో విలసిల్లుతున్నారని, తనేం చేయాలో చెప్పాలంటూ అభ్యర్థిసాడు. కొడుకు మాటలను విన్న ధృతరాష్ట్రుడు, పాండవుల్లా ఐశ్వర్యంలో తులతూగాలంటే నీతినియమాలతో ప్రవర్తించాలనీ, అందుకు ఉదాహరణ ప్రహ్లాదుడేనని చెబుతాడు. అవును, ప్రహ్లాదుడు రాక్షసుల మధ్య జన్మించినప్పటికీ, అతడు నడిచిన బాట నైతిక ఋజువర్తనతో కూడినదే. ప్రహ్లాదుని ఋజువర్తనం ఇంద్రుని ఉదంతంతో తెలుస్తోంది.

After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story



ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలై న సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం. విజ్ఞానం కంటే గొప్పదైన విషయం ఏమైనా ఉందా అని, అదే విషయాన్ని బృహస్పతిని అడిగితే, ఆ సంగతిని తెలుసుకోవాలంటే రాక్షసగురువు శుక్రాచార్యుని కలుసుకోమంటాడు. వెంటనే ఇంద్రుడు శుక్రుని దగ్గరకెళ్ళి తన సందేహాన్ని వెలిబుచ్చగా, అందుకు తగిన సమాధానం చెప్పగలవాడు ప్రహ్లాదుడేనని శుక్రుడు చెబుతాడు. ప్రహ్లాదుని దగ్గరకెళ్ళిన ఇంద్రుడు సంతోషానికైన అసలు మూలకారణం ఏమిటిని ప్రశ్నించగానే, తనిప్పుడు పరిపాలనలో నిమగ్నమై ఉండటంవల్ల సమాధానం చెప్పే తీరకలేదన్న ప్రహ్లాదుడు, తనను క్షమించమంటాడు. అయినా పట్టువదలని ఇంద్రుడు, ఏదో ఒకరోజు వీలుచిక్కినప్పుడు, ఆ రహస్యాన్ని వివరించమని, అప్పటి వరకు తాను అక్కడే ఉంటానంటూ ప్రహ్లాదునికి సేవలు చేస్తూ గడుపుతుంటాడు. అలా కొన్నాళ్ళు గడిచిన పిదప, ఇంద్రుని శ్రద్ధను మెచ్చిన ప్రహ్లాదుడు ఇలా సమాధానం చెప్పాడు. ‘‘రాజాగా నా స్థాయిని తలచుకుని నేను ఏనాడూ గర్వపడలేదు. సాధుజనుల సేవకునిగా ఉంటూ, గురువులు, పెద్దలపట్ల గౌరవభావాన్ని కలిగివుంటాను. విపరీతమైన కోరికలతో గతి తప్పను. సంతోషానికి ఇదే కచ్చితమైన మార్గం’’. ప్రహ్లాదుని సమాధానం ఇంద్రుని సంతోషపరుస్తుంది. 

After Samundra Manthan, Goddess Lakshmi was born. Goddess Lakshmi is ... Goddess Lakshmi always stay at a place where a Mythological Story



ఇంద్రుని భక్తిని మెచ్చిన ప్రహ్లాదుడు ఏదైనా వరం కోరుకొమ్మంటాడు. వెంటనే కపటి ఇంద్రుడు తనకు నైతిక ఋజువర్తనను అనుగ్రహించమని అభ్యర్థిస్తాడు. ప్రహ్లాదుడు ‘సరే’నని ఒప్పుకోగానే, అతని నుంచి ఓ జ్వాల బయటకు వస్తుంది. ‘‘నేను నీలోని నీతివంతమైన నడవడిని, నువ్వు నన్ను వెలికి తీసినందువల్ల ఇక పై నీ శిష్యునిలో నివశిస్తానని చెప్పి, ఇంద్రునిలోకి ప్రవేశిస్తుంది. అనంతరం ప్రహ్లాదునిలో నుంచి బయల్దేరిన మరోజ్వాల, తాను అతనిలోని ధర్మశీలతనని, నైతిక సౌశీల్యం లేకుండా కండజాలనని ఇంద్రుని శరీరంలో ప్రవేశిస్తుంది. అనంతరం బయటపడిన సత్యం, తాను నిజాన్ని అని, ధర్మబద్ధతతో ఉంటానని చెప్పి వెళ్ళిపోతుంది. తదనంతరం వెలువడిన మరోజ్వాల తాను అధికారాన్ని అని, తాను నిజం వెంటే ఉంటానని ఇంద్రునిలో ఐక్యమవుతుంది. చివరగా ధవళకాంతులతో మెరిసిపోతోన్న ఓ దేవత బయటకొచ్చి, తనను లక్ష్మి అంటారనీ, సంపదల దేవతనని, దీర్ఘకాలం నీవెంటే ఉన్నానని, ప్రస్తుతం తనను వదలిపెట్టడానికి ప్రహ్లాదుడు సిద్ధపడినందున తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళిపోవాల్సి వస్తోందని చెప్పి బయటపడుతుంది. ఈ విధంగా ధర్మ ప్రవర్తన, నిజం, అధికారం, నైతికబద్ధ ప్రవర్తన ఉన్నచోట లక్ష్మీదేవికొలువై ఉంటుందని అర్థమవుతోంది. లక్ష్మీదేవి చల్లనిచూపుల కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. తమ ఇళ్లను పావనం చేయాలని ముకుళిత హస్తాలతో ప్రార్థిస్తుంటారు. ఆతల్లి భక్త జనప్రియ. తనను పూజించిన భక్తులను తప్పక కరుణిస్తుంది.

లక్ష్మీప్రాప్తికి తాంత్రిక మంత్రం ?


teluguone gives complete information on Goddess Lakshmi Tantrik Mantra Sadhana For wealth lakshmi mantras and prayers by teluguone


"ఓం, ఐం, హ్రీం, శ్రియైనమౌ
  భగవతి మమ సంరుద్ధౌ జ్వల
  జ్వల మా సర్వ సంపదం దేహిదేహి
  మమ అలక్ష్మీ నాశయ హుం ఫట్ స్వాహీ''

ఈ మంత్రాన్ని మీ శక్తిని బట్టి పఠించండి. ఒక రోజులో 108 సార్లు మాత్రం తప్పకుండా జపించాలి. మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ధనం రావటం మొదలవుతుంది. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. నైతిక కార్యాల్లో విజయం లభిస్తుంది.

జయవిజయులకు లక్ష్మీదేవి శాపం ?


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya


వైకుంఠంలో విష్ణుమూర్తి దగ్గర ఇద్దరు ద్వారపాలకులు ఉంటారు. వారి పేర్లు జయుడు - విజయుడు. ఇద్దరూ విష్ణుభక్తులే. ఒకరోజు సనకసనందనాదులు విష్ణు సందర్శనం కోసం వైకుంఠానికి వచ్చారు. సనకసనందనాదులు మహామునులు, బ్రహ్మ మానసపుత్రులు, అసాధారణ మహిమలు గల మహనీయులు. సకల జగత్తూ వారికి ఈశ్వరమయంగానే కనిపిస్తుంది. వారికి ఎక్కడా ఎలాంటి అడ్డూ అదుపూ లేదు, ఉండదు, వారెప్పుడూ అయిదేళ్ళ ప్రాయంలోనే ఉంటారు. నగ్నంగా ఉంటారు, బాలురిలా కనిపిస్తారు. వైకుంఠంలో ప్రవేశించిన సనకసనందనాదులు ఆరు ద్వారాలు దాటారు, ఏడవ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అక్కడే జయవిజయులు కాపలాగా ఉన్నారు. లక్ష్మీదేవి, విష్ణుమూర్తుల కేళీమందిరమే ఏడవ ద్వారం. ఆ ద్వారం దాటాలంటే జయవిజయుల అనుమతి తీసుకోవాల్సిందే!


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya


అయితే సనకసనందనాదులకు ఒకరి అనుమతితో పనిలేదు. బ్రహ్మ స్వరూపులు వారు. ఏడవ ద్వారం దాటబోతుండగా జయవిజయులు వారిని అడ్డగించడమే కాక మదాంధులై ఆ మహామునుల్ని నిందావాక్యాలతో అవమానించారు. "చిన్నపుల్లలు ... దిగంబరులై ఉన్నారు. ఇంకో మాటగా చెప్పాలంటే పిచ్చివాళ్ళలా కనిపిస్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఇది వైకుంఠం, ఏడవ ద్వారం. ఏకాంత మందిరంలోని శ్రీవారిని దర్శించాలంటే మా అనుమతి కావాలి మీరు తీసుకున్నారా? లేదు. లేనప్పుడు ఎలా లోపలికి వెళ్ళగలరు? వెళ్ళండి, వెనక్కి వెళ్ళిపొండి ముందు ఇక్కడినుంచి'' సనకసనందనాదులు నిలబడిపోయారు. 


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya



ఒకరినొకరు చూసుకుని జయవిజయుల్ని చూసి ఆగ్రహం చెంది ఇలా అన్నారు ... "జయవిజయులారా! మమ్మల్ని ఎవరని అనుకుంటున్నారు? మేము సనకసనందనాదులం, విష్ణుభక్తులం. ఆ శ్రీహరిని సందర్శించడానికి మాకు ఒకరి అనుమతి అవసరం లేదు. నిష్కాములమయిన మేము శ్రీహరిని సేవించేందుకు వెళ్తుంటే మీరు మమ్మల్నే అడ్డుకుంటారా? దురాత్ములు మీరు. ఇక్కడీ పున్యలోకంలో ఉండడానికి మీరు అనర్హులు. మీ పాపానికి భూలోకమే సరైంది. వెళ్ళి భూలోకంలో పుట్టండి'' అని శంపించారు. ఆ శాపానికి జయవిజయులు భయకంపితులై మునుల కాళ్ళ మీద పడి తమని కాపాడమని వేడుకున్నారు. "మహా మునులారా! మీ పుటల తప్పుగా ప్రవర్తించాం, మా అజ్ఞానాన్ని క్షమించండి. శ్రీహరికి దూరంగా మేము ఒక్క క్షణం కోదోయా జీవించి ఉండలేము. కరుణించండి. మీ శాపానికి తిరుగులేదు. ఆ సంగతి మాకు తెలుసు అందుకనే మా కోరిక మన్నించండి. మేము ఏ జన్మ ఎత్తినా, ఎక్కడ ఉన్నా మాకు భగవద్భక్తీ, భగవన్నామస్మరణా ఉండేలా అనుగ్రహించండి.'' ఏకాంత మందిరంలో ఉన్న శ్రీహరికి ఇదంతా వేడుకగా అనిపించింది. నవ్వుకుని బయటికి వచ్చాడు. 


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya



శ్రీహరిని చూస్తూనే సనకసనందనాదులు చేతులెత్తి నమస్కరించి అనేక వేదమంత్రాలతో స్తుతించారు. శ్రీహరి సంతోషించి మునులను చూసి తరువాత జయవిజయులను చూసి తాను అంతా గ్రహించినట్టుగా చూపులతోనే వారికి తెలియజేశాడు. మునులతో ఇలా అన్నాడు "మహామునులారా! ఈ జయవిజయులు మీ పట్ల క్షమించరాని నేరమే చేశారు. వారు శిక్షార్హులే. సేవకులు చేసిన అపకారాలు, అపచారాలు అన్నీ ప్రభువుకే చెందుతాయి. ఈ కారణంగా నేను కూడా మీ పట్ల తప్పుగా ప్రవర్తించినట్లే. అందుకే వేడుకుంటున్నాను. క్షమించండి. మునులు దైవసమానులు, అందునా నా భక్తులు నాకంటే అధికులు. మీ మాటలు పోల్లుపోవు, మీ శాపం ఫలించి తీరుతుంది'' "అంతా నీ లీల'' అని మునీశ్వరులు శ్రీహరిని మరొక్కసారి మనసారా చూసుకుని నమస్కరించి నిష్క్రమించారు.


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya



జయవిజయులు శ్రీహరి కాళ్ళపై పడి "అజ్ఞానంతో మునులను అవమానించాం. నీ సేవకులుగా నీకు మహోపచారం చేశాం. తప్పే అని ఒప్పుకుంటున్నాం. కాని, వారి శాపాన్ని మేము భరించలేము. నీకు దూరంగా జీవించలేము, కరుణించు మహాదేవా ... కటాక్షించు'' అని వేడుకున్నారు. శ్రీహరి వారిని చూస్తూ "మునుల శాపం తిరుగులేనిది, అనుభవించి తీరాల్సిందే. పైగా లక్ష్మీదేవి కూడా మిమ్ములను శపించింది జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకరోజు నేనూ లక్ష్మీదేవి ప్రణయకలహం కారణంగా విడిపోయాం. నేను నా ఏకాంత మందిరంలో అలిగి పడుకుని ఉన్నాను. నా అలక తీర్చేందుకు లక్ష్మీదేవి మందిరంలోకి వస్తుంటే అప్పుడు కూడా మీరు ఆమెను అడ్డుకున్నారు. అప్పుడు ఆమె కూడా మిమ్మల్ని శపించింది. మునుల శాపం, లక్ష్మీదేవి శాపం ఫలించి తీరాల్సిందే ... తప్పదు'' అన్నాడు. 


Detailed Story is related to Sanat Kumaras hey curse the two doorkeepers that they will have to give up their divinity, leave Vaikuntha, will be born on the Earth, Goddess Lakshmi Gives Curse to Jaya Vijaya



జయవిజయులు వెక్కివెక్కి ఏడుస్తూ శ్రీహరిని పరిపరివిధాల వేడుకున్నారు. శ్రీహరి వారిని చూసి జాలి కలిగి ఇలా అన్నాడు "దిగులు పడకండి. భూలోకంలో మీరు రాక్షసులై జన్మించి, నాకు బద్ధశత్రువులుగా మారి దేవ బ్రాహ్మణులకు అపకారం చేస్తూ జీవిస్తారు. ఆఖరికి నా చేతుల్లోనే మరణిస్తారు. మూడు జన్మల అనంతరం మళ్ళీ మీకు వైకుంఠ ప్రవేశం ఉంటుంది. స్నేహంతోకానీ, శతృత్వంతో కానీ నిరంతరం నన్నే స్మరించేవారికే నా సాయుజ్యం లభించకుండా ఉండడు. విరోధం కారణంగా మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉంటారు. అనుక్షణం నన్ను ద్వేషిస్తూ ఉంటారు. ఆ కారణంగా మీరు నన్ను ఎడబాసి ఉన్నట్లే ఉండదు. శ్రీఘ్రకాలంలో మీరు నన్ను చేరేందుకు ఇదే సరైన మార్గం'' అని శ్రీహరి జయవిజయుల్ని ఓదార్చాడు. అలా జయవిజయులు అటు సనకసనందాదుల శాపానికి, ఇటు శ్రీలక్ష్మీదేవి శాపానికి గురయ్యారు.

లక్ష్మీదేవికి ప్రియమైన వ్రతం

"కోజాగిరి వ్రతం'' గురించి మీకు తెలుసా?


Sharad Poornima is also known as Kojaagari Poornima or Kumar Poornima. It is celebrated on the full moon day of the Hindu lunar month of Ashvin, Basically a harvest festival, it also has religious significance


సంపదలను, సౌభాగ్యాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా శ్రీలక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైన వ్రతం, దారిద్ర్య వినాశక వ్రతం "కోజాగిరి వ్రతం''. దారిద్ర్యం తొలగిపోయి, లక్ష్మీదేవి ప్రసన్నం  లభించే వ్రతాన్ని వివరించమని మహర్షులు వాలిఖిల్య మహర్షిని కోరగా, వాలిఖిల్య కోజాగిరి వ్రతాన్ని వివరించినట్లు పురాణాలలో ఆధారం ఉంది. పూర్వం మగధదేశంలో "వలితుడు'' అనే బ్రాహ్మణుడు నివశిస్తూ ఉండేవాడట. అతను గొప్ప పండితుడు, భక్తుడు. కానీ అతను కటిక పేదవాడు. ఆయన భార్య అయిన చండి పరమగయ్యాళి. తనకు బంగారం, పట్టు వస్త్రాలు కొని ఇవ్వలేదని వలితుడి మాటలను ధిక్కరించి వ్యతిరేకంగా ఉండేది. వలితుడి స్నేహితుడైన గణేశ వర్మ వలితుడి బాధ చూసి, ఆలోచించి "నీవు ఏ పని చేయించుకోవాలంటే దానికి వ్యతిరేకంగా పని చేయమని నీ భార్యకు చెప్పు. అప్పుడు ఆమె నీకు అనుకూలమైన విధంగా పని చేస్తుంది. కాబట్టి నీ పని జరుగుతుంది'' అని సలహా ఇచ్చాడు. కొంతకాలానికి వలితుడి తండ్రి ఆబ్ధికం వచ్చింది. స్నేహితుడు చెప్పినట్టుగా వలితుడు "రేపు మా తండ్రిగారి ఆబ్ధికం, అయినా నేను ఆబ్ధికం పెట్టదలచుకోలేదు'' అని భార్య చండితో అన్నాడు. భర్త మాటలు విన్న చండి మామగారి ఆబ్దికాన్ని వలితుడితో చేయించింది. అన్నీ సవ్యంగా జరుతున్నాయన్న సంతోషంలో వలితుడు భార్య చండితో "పిండాలను తీసుకువెళ్ళి నదిలో పడేసి'' రమ్మన్నాడు. వెంటనే చండి పిండాలను ఊరిలోని కాలువలో పడేసి వచ్చింది.

Sharad Poornima is also known as Kojaagari Poornima or Kumar Poornima. It is celebrated on the full moon day of the Hindu lunar month of Ashvin, Basically a harvest festival, it also has religious significance



ఇది చూసిన వలితుడి మనస్సు విరక్తి చెందడంతో ఇల్లు వదిలి అరణ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం తరువాత ఆశ్వీయుజ పౌర్ణమి వచ్చింది. సాయంకాలం అయింది. నాగకన్యలు ముగ్గురు వచ్చి నదిలో స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించారు. పాచికలు ఆడడానికి సిద్ధమయ్యి నాలుగో మనిషి లేకపోవడంతో ఎవరైనా ఉన్నారేమోనని చుట్టుపక్కలా గాలించారు. వారికి వలితుడు కనిపించాడు. వలితుడిని పాచికలు ఆడడానికి రమ్మని కోరారు. అది జూదం కాబట్టి తాను ఆడనని వారికీ వివరించాడు. ఈ రోజు పాచికలు ఆడటం నియమమని నాగకన్యలు వలితుడిని ఒప్పించి పాచికలు ఆడడానికి ఒప్పించారు. భూలోకంలో ఎవరు మేలుకుని ఉన్నారో చూడడానికి వచ్చిన లక్ష్మీసమేతుడు విష్ణువు భూలోకంలోకి రాగా వారికీ ముగ్గురు నాగకన్యలు, వలితుడు పాచికలు ఆడుతూ కనిపించారు. దీనికి సంతోషించిన లక్ష్మీదేవి వారికి సర్వసంపదలు ప్రసాదించారని వాలిఖిల్య మహర్షి వివరించాడట. కాబట్టి ఆశ్వీయుజ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి సర్వసంపదలు చేకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి.

శ్రీ లక్ష్మీప్రవేశానికి స్వర్ణ సూత్రాలు ?


Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi


శ్రీ లక్ష్మీ అమ్మవారి కటాక్షం తప్పకుండా కావాలని కోరుకునేవారు సరళమైన ఉపాయాలను, మార్గాలను అనుసరించి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవచ్చు. పూజా విధానాన్ని అనుసరించే ముందు, శరీర శుభ్రతను పాటించినట్టు, మానసిక పవిత్రతను కూడా ఆచరించాలి. ఎందుకంటే ....

    "మంత్రతీర్థే ద్విజే దేవె దైవజ్ఞే ఖైషజెగురౌ |

     యదృశే భావనా యస్య సిద్ధర్భవతి  తాదృశీ ||

అంటే మంత్రం, తీర్థం, బ్రాహ్మణుడు, దేవత, జ్యోతిష్కుడు, ఔషధము మరియు గురువుల పవిత్రతను కూడా ఆచరించాలి. ఎందుకంటే ...
    "మంత్రతీర్థే ద్విజే దేవె దైవజ్ఞే ఖైషజెగురౌ |
     యదృశే భావనా యస్య సిద్ధర్భవతి  తాదృశీ ||
అంటే మంత్రం, తీర్థం, బ్రాహ్మణుడు, దేవత, జ్యోతిష్కుడు, ఔషధము మరియు గురువుల యందు ఎలాంటి భావాన్ని మనం ఆపాదిస్తామో అలాంటి సిద్ధినే పొందుతాము "యద్భావత్ తద్భవతి'' అన్నమాట.
శ్రీకృష్ణభగవానుడు కూడా అలాంటి భావననే 'గీత'లో ప్రకటించి ఉన్నాడు.

    "యే యధామా ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహమ్ ''

అంటే ఎవరు నన్ను ఏ విధంగా భజిస్తారో అలాంటి ఫలాన్నే నేను అందిస్తాను అని అర్థం.

Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi




సాధనకు ముందు కావలసిన సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి. మనం ఇళ్లలో చాలా పనుల్లో కూర్చోటానికి పీటల్ని ఉపయోగిస్తాము. మీరు స్వయంగా కూర్చునే ఆసనం గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. భూమికి కొద్దిగా ఎత్తుగా ఉండటానికి వీలుగా ఆసనం ఎందుకు తయారుచేసుకుంటారో మీకు తెలుసా? జపం చేసుకునే మీలోంచి ఊర్జా (శక్తి) జనిస్తుంది. మీ శరీరం భూమికి దగ్గరగా ఉండటం చేత ఆ ఊర్జా అర్థింగ్ ద్వారా భూమిలోకి వెళ్ళిపోతుంది. ఆ శక్తి కక్షీయాన్ని ఆపటానికి ఆసనం ప్రయోగిస్తారు. పద్మాసనం వల్ల బొటనవ్రేలిని భూమిని తాకకుండా ఎత్తులో ఉంచుతారు. ఆసనం రంగు ఎలా వుండాలో నిర్ణయించుకోవడానికి ముందు ఆ సాధన ఎటువంటిదోనన్న దాన్ని బట్టి వుంటుంది.
లక్ష్మీ, ఐశ్వర్యం, ధనసంబంధ ప్రయోగాలైతే - పసుపు ఆసనాన్ని తయారు చేసుకోవాలి.
సాత్వికమైన సాధనాలకు, కుశాణువుతో తయారైన ఆసనం మంచిది.
ఎరుపు, పసుపురంగు దారాన్ని సిద్ధం చేసుకోవాలి.
లక్ష్మీ సంబంధమైన పూజా ప్రయోగానికి పసుపురంగు నూలు వస్త్రాలను ధరించాలి. పైన శాలువా కప్పుకోవాలి.
అక్షతలను సిద్ధం చేసుకోవాలి.
సాధన చేసేటప్పుడు ఎటువైపు ముఖం పెట్టాలన్న సందేహం కలుగుతుంది. ప్రత్యేకమైన దిశానిర్దేశం లభించని ఎడల మీరు పశ్చిమాభిముఖంగా కూర్చుని సాధన సాగించాలి.

Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi



సాధనను బట్టి కొన్ని చిహ్నాలను సూచిస్తారు. ఆ చిహ్నాలు షట్ కోణం, అప దశమని, స్వస్తిక్ అని ఉంటాయి. భౌతిక సమృద్ధిని సూచించే శ్రీయంత్రం, దక్షిణామూర్తి శంఖం, పాదరస శివలింగం, పాదరస లక్ష్మీ, పాదరస వినాయకుడు మొదలైన వాటిని స్థాపించి సాధన చేసేయోగం అందరికీ లేకపోవచ్చు. దిగులు పడకండి. దిగువ కొన్ని మార్గాలను పేదవారు అనుసరించి సాధనం చేసుకోవచ్చు.
దీపావళి రోజు అఖండమైన రావిచెట్టు ఆకును త్రుంచుకుని రావాలి. ఆ ఆకును తమ పూజాస్థానంలో గానీ, పవిత్రమైన పరిశుభ్రమైన చోటులో ఉండాలి. తరువాత వచ్చే శనివారం రోజున ఒక క్రొత్త రావి ఆకును త్రుంచుకుని రావాలి. పాత ఆకుని పెట్టిన చోటులో దీన్ని కూడా ఉంచాలి. ప్రతి శనివారం ఇలాగే చేస్తూ పోవాలి. గమనిస్తూ ఉండండి, లక్ష్మీకటాక్షం కలుగుతుంది. లక్ష్మీకటాక్షం కలిగాక సాధన ఆపుచేసుకోవచ్చు. అమావాస్య నుండి మొదలుపెట్టి ఎన్ని శనివారాలు చేసుకోవాలని సంకల్పం చేసుకుంటారో, ఆ విధంగా సాధన కొనసాగించండి. ప్రాతః కాలం లేవగానే ఎవరినీ చూడకండి. కళ్ళు మూసుకునే మీ అరచేతుల్ని కళ్ళదగ్గరికి తెచ్చుకుని చూడండి. ముఖం మీద రెండు అరచేతుల్ని త్రిప్పుకోండి. భోజనానికి తయారుచేసే మొదటి రొట్టె లేదా ఎవరూ ముట్టుకోని కొద్ది అన్నాన్ని ఆవుకు తినిపించండి. శనివారం రోజు గోధుమల్ని పిండి పట్టించే నియమం పెట్టుకోండి. ఆ పిండిలో పదవభాగం నల్ల శెనగలు కలపండి. (చిన్న సైజు శెనగలు) మీ ఇంట్లో చీమలు ఉంటాయి కదా వాటికి చెక్కర కలిపినా పిండిని వేసి తినిపించండి. మీ ఇంట్లో గోడలకు లేదా పూజాగృహంలో ఉన్న చిత్రాలకు కుంకుమ, చందనం, పుష్పాలు అలంకృతం చేయండి. ప్రాతః కాలం ఇల్లు శుభ్రం చేయకుండా టిఫిన్ తినకండి.

Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi




సంధ్యాసమయంలో ఇల్లు శుభ్రం చేసే కార్యక్రమాలు చేయకండి. సంధ్యా సమయానికి పూర్వమే దీపాన్ని వెలిగించాలి. విద్యుత్ దీపాలుకాదు, ఇంటి సౌభాగ్యవతులు ప్రసన్నవదనంతో దేవీ-దేవతలకు ధూప, దీప, హారతి ఇవ్వండి. ఏ పని కోసమైనా ఇంటి నుండి బయటికి వెళ్ళే ముందు, ఇంటికి చీపురుతో శుభ్రం చేసుకోవాలి. పరగడుపున కార్యార్థం బయటికి వెళ్ళకూడదు. కనీసం ఒక చెంచాడు తీయని పెరుగుని నోటిలో వేసుకునైనా వెళ్ళండి. శుభం జరుగుతుంది. గురువారం రోజు ఏ మహిళనైనా ఇలిచి మంగళకరమైనది ఏదైనా ఒకటి దానం చేయండి. దీన్ని క్రమబద్ధం చేసుకోండి. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీకటాక్షం కలుగుతుంది. ధన సంబంధమైన కార్యాలన్నిటికీ సోమవారం, బుధవారాలకు ప్రాధాన్యత ఇవ్వండి. ఆర్ధిక పనులమీద బయటికి వెళ్ళేముందు లక్ష్మీ సంబంధమైన యంత్రాలను, తాంత్రిక వస్తువులను, శ్రీగణేశుడిని దర్శనం తప్పకుండా చేసుకుని బయట కాలు పెట్టండి. పుష్పదానం చేసి, అందులోని ఓ పువ్వును జేబులో వేసుకుని వెళ్ళండి, లేదా తమ దగ్గర ఉంచుకోండి.


Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi



క్రొత్త కార్యం కోసం, వ్యవసాయం, ఉద్యోగం తదితర శుభకార్యాల కోసం వెళ్ళేముందు ఇంటిలోని ఓ మహిళ పిడికెడు మినుములను పిడికిటిలో బంధించి, అతనికి దిష్టి తీసి పంపితే అతని పనుల్లో విజయం చేకూరుతుంది. బయటికి వెళ్ళినవారు ఇంటికి ఒట్టి చేతులతో రాకండి. కనీసం చెట్టు ఆకునైనా కోసుకుని ఇంటిలోకి ప్రవేశించండి. నల్ల పసుపుకొమ్ము లక్ష్మీ ప్రతీకం. శుభముహూర్తాన దాన్ని ఇంటిలో పూజాగృహంలో క్యాష్ బ్యాగ్ లో ఉంచుకుంటే మంచిది. కొన్ని తాంత్రిక దుర్లభ వస్తువులు ఉన్నాయి. వాటిలో నక్కకొమ్ము, పిల్లనాళము, ఎకముఖీరుద్రాక్ష, దక్షిణామూర్తి శంఖం, హత్తాజోడీ, ఎకాక్షీ నారికేళం, శ్రీయంత్రం, కనకధారా యంత్రం అలాంటి వాటిలో శ్రీమహాలక్ష్మీని తమ వైపు ఆకర్షించే గుణమున్నది. వీటిని సంస్కరించాలి. అంటే ప్రాణప్రతిష్ట చేయాలి. మంత్రసిద్ధం చేయాలి. ఇవి సామాన్యమైన వస్తువులు కావు. తగిన మర్యాదలు చేయగలిగితే తగిన ఫలితం దక్కుతుంది. దీపావళి రాత్రికి లేదా గ్రహణ సమయంలో ఒక లవంగం, ఒక ఇలాయిచీ కాల్చి భస్మాన్ని దేవీ, దేవతల చిత్రపటాలకు, యంత్రాలకు వ్రాయండి. ఏదో ఒక సూర్యనక్షత్రపు వేళ - గబ్బిలాలు నివశించే చెట్టు దగ్గరకి వెళ్ళండి. ఆ చెట్టు కొమ్మను ఒకదాన్ని త్రెంచుకుని మీ దిండు క్రింద పెట్టుకోండి. ఆ తరువాత పరిణామాలను పరీక్షించండి. బ్యాంక్ లో డబ్బులు జమ చేసేటప్పుడు మనఃస్ఫూర్తిగా క్రింద ఇవ్వబడిన ఏదో ఒక మంత్రాన్ని జపించండి.

    "ఓం మహాలక్ష్మైనమః''

    "ఓం శ్రీంహ్రీం క్లీం, హ్రీం, శ్రీం మహాలక్ష్మైనమః''

చెక్ బుక్, పాస్ బుక్ డబ్బుసంబంధమైన కాగితాలున్న చోట శ్రీయంత్రాన్ని కానీ, కుబేరయంత్రాన్ని గానీ దగ్గరలో ఉంచండి. క్రింద యివ్వబడిన రామరక్షా స్తోత్రం, శ్రీక్ష్మీ కృప సమన్వితం. ఈ మంత్రం ధనప్రాప్తికి ఎంతో ఉపకరిస్తుంది అంటారు.

    "అవదామ్ అపహర్తారమ్ దాతారమ్ సర్వసంపదామ్ |

     లోకాభిరామమ్ శ్రీరామమ్ భూయో భూయోనమావ్యహమ్ ||


Information and Secrets for Attracting Wealth of Goddess Lakshmi in to your house, simple techniques for attracting Hindu Goddess Laxmi Devi



మహాలక్ష్మీకి తులసీ పత్రాన్ని, తులసి మంజరిని సమర్పించండి. సాధనా, పూజా, ప్రార్థనా సమయంలో మీ ముఖం తూర్పువైపు ఉండాలి. పశ్చిమంవైపు అయినా ఉండవచ్చు. ప్రతి శనివారం ఇంటికి శుభ్రపరచుకోవాలి. సాలెగూళ్ళు, మట్టి, చెత్త, విరిగిపోయిన వస్తువుల్ని సర్ది చెక్కబరచుకోవాలి. మీ ఇంటి సింహద్వారం దగ్గర లోపలివైపు, శ్రీగణేశుడిని ఉంచండి. ఆయన ముఖం మీ ఇంటిని చూస్తున్నట్టు ఉండాలి. దిశను గురించి పట్టించుకోన అవసరం లేదు. ఆయనకు ప్రాతఃకాలమే పచ్చిగడ్డి పరకాలను సమర్పించుకోండి. ప్రతినిత్యం మీరు మీ మనస్సులో 11 సార్లు, నేను తప్పకుండా ధనవంతుడిని అవ్వాలని దృఢసంకల్పాన్ని పునరావృత్తం చేసుకుంటూ ఉండండి. తధాస్తుదేవతలు మీపట్ల ఏదో ఒక రోజు కరుణించక పోరు.

గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపమా?


what are the benefits of Sea Shells relating to Goddess Lakshmi, Are Sea Shells reflex of Goddess Laxmi



గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపం. గవ్వలు సముద్రంలో సహజసిద్ధంగా లభిస్తాయి. శంఖాలకు ఏవిదమైన ప్రాదాన్యత ఉందో గవ్వలకు అదేవిధమైన ప్రాదాన్యత ఉందనీ పండితులు చెబుతున్నారు. గవ్వలు లక్ష్మీ దేవి స్వరూపంగా కొలుస్తారు. అనేక దేశాలలోని గిరిజన ప్రాంతాలలో గవ్వలని నాణేలుగా చలామణి చేయటం ఇప్పటికీ అమలులో ఉంది. దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా వస్తుందని నమ్ముతారు. గవ్వలు లక్ష్మీ దేవి చెల్లెల్లు అని, శంఖాలను లక్ష్మీదేవి సోదరులనీ భావిస్తుంటారు. గవ్వలు లక్ష్మీదేవికే కాక శివునికి కూడా ప్రత్యక్ష సంబందం ఉంది. శివునికి చేసే అష్టాదశ అలంకరణలో గవ్వలుకూడ ఉంటాయి. శివుని జటాజూటంలోను, శివుని వాహనమైన నందీశ్వరుని మెడలోనూ గవ్వలే అందంగా ఉంటాయి. గవ్వలు అలంకరణ వస్తువుగాను, ఆటవస్తువుగాను, తాంత్రిక వస్తువుగాను ఉపయోగపడుతుంది. పంచతంత్రంలో ఒక చోట "చేత గవ్వలు లేనట్లయితే స్నేహితుడే శత్రువు అవుతాడు." అని ఉంది. కాబట్టి గవ్వలకి ఆధ్యాత్మిక, సాంస్కృతిక, ఆర్ధిక జీవనంతో సంబందాలు ఉన్నాయి అనేది వాస్తవం.

గవ్వల వల్ల కలిగే ఉపయోగాలు :


what are the benefits of Sea Shells relating to Goddess Lakshmi, Are Sea Shells reflex of Goddess Laxmi



1)    పిల్లలకి దృష్టిదోష నివారణకు గవ్వలను వారి మెడలోగాని,మొలతాడులోగాని కట్టాలి.
2)    కొత్తగా కొన్న వాహానాలకు నల్లని తాడుతో గవ్వలని కట్టి దృష్టిదోషం లేకుండా చేసుకోవచ్చు.
3)    గృహా నిర్మాణ సమయంలోను ఎటువంటి అవాంతరాలు రాకుండా గవ్వలను ఎక్కడో ఒకచోట కడతారు. కొత్తగా ఇళ్ళు గృహాప్రవేశం చేసే వారు గుమ్మానికి తప్పనిసరిగా గుడ్డలో గవ్వలను కట్టాలి. అలా చేయటం  వలన గృహాంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే.
4)    గవ్వలని పసుపు వస్త్రంలో పూజా మందిరంలో ఉంచి లలిత సహాస్త్రనామాలతో కుంకుమార్చన చేస్తే ధనాకర్షణ కలుగుతుంది.
5)    గల్లా పెట్టెలో గవ్వలను డబ్బులు తగులుతూ ఉంచటం వలన ధనాభివృద్ధి కలుగుతుంది.
6)    వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర ఉంచుకోవటం వలన శీఘ్రంగా వివాహా ప్రయత్నాలు జరుగుతాయి.
7)    వివాహ సమయములలో వదూవరులు ఇద్దరి చేతికి గవ్వలు కడితే ఎటువంటి నరదృష్టి లేకుండా వారి కాపురం చక్కగా ఉంటుంది. గవ్వలు శుక్రగ్రహానికి సంబందించినది కాబట్టి గవ్వలు కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతల్ని గవ్వలతో పూజిస్తారు.
8)    వశీకరణ మంత్ర పఠన సమయంలోను గవ్వలను చేతిలో ఉంచుకోవటం మంచిది.
9)    గవ్వల గలలలు ఉన్న చోట లక్ష్మీదేవి ఉన్నట్లే

108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐశ్వర్యాలు వరిస్తాయి



జీవితం శుభకరంగా, మంగళకరంగా, సంతోషమయంగా సాగాలంటే ఆ లక్ష్మీ కటాక్షం ఉండాలి. లక్ష్మీ దేవి విశేష అనుగ్రం పొందాలంటే శుక్రవారం, ఏకాదశి రోజులలో తప్పక పూజించుకోవాలి. ప్రకృతిం వికృతిం విద్యాం అంటూ ప్రారంభమయ్యే లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం ప్రతినిత్యం 3 పూటల ఇంద్రియ నియమంతో 6 నెలలు పారాయణ చేస్తే సకల విధములైన లేములు తొలిగిపోయతాయిం. అందుకే దీనిని దారిద్రయ్య విమోచన స్తోత్రం అంటారు. ఒక సంవత్సర కాలం పాటు నియమములతో ప్రతి శుక్రవారం 108 పర్యాయాలు పఠిస్తే అన్ని ఐస్వర్యాలు వరిస్తాయి. ఈ మంత్రం పార్వతికి శివుడు ఉపదేశించినది.

శ్రీ అష్టలక్ష్మీదేవాలయం -చినెరుకపాడు


ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజున అష్టలక్ష్మీ ఆలయాన్ని సందర్శించుకుంటే మరీ శుభకరం.  అలాంటి ఆలయం కృష్ణజిల్లా, గుడివాడ మండలం, బిల్లపాడు సరిహద్దులోని చిన ఎరుకపాడులో శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం ఉన్నది. గుడివాడ నుండి పామర్రుకు వెళ్ళు రోడుమార్గం ప్రక్కన ఈ ఆలయం నిర్మితమై ఉన్నది. దత్తపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు ఈ క్షేత్రంలో దత్తపాదుకలను ప్రతిష్టించి, గురుదత్త పాదుకా క్షేత్రంగా దీనిని పిలిచారు. ఆ తరువాత ఇటీవల కాలంలో స్వామీజీ వారి పవిత్ర హస్తలతో, అష్టలక్ష్మీ ప్రతిష్ట, యంత్రస్థాపన, ధ్వజస్తంభస్థాపన, సిద్ధిబుద్ధి సమేత గణపతి ప్రతిష్ట, అనుఘాదేవి, దత్తాత్రేయ ప్రతిష్టలు జరిగాయి.


    అమ్మవారి ఆలయ ప్రవేశద్వారం వినూత్నంగా నిర్మింపబడి ఉంది. రెండువైపులా ఆలయ ప్రవేశపు పడికట్లు లోహపు కడ్డీలతో అమర్చిన పార్శ్యభాగాలతో అందంగా ఉంటాయి. ఈ ప్రవేశద్వారానికి ఎడమవైపు విఘ్నేశ్వరుడు, కుడివైపు శ్రీ వల్లీదేవసేనాసమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి కొలువై ఉన్నారు. గర్భాలయంలో శ్రీమహాలక్ష్మీదేవి చరణపద్మాలు, అభయ, వరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తాయి. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉత్సవమూర్తులు, శ్రీచక్రయంత్రం, సుమేరువు అమ్మవారికి దిగువభాగంలో నెలకొని ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ప్రధాన ఆలయానికి అనుబంధంగా అష్టగణపతుల మందిరం, శ్రీశ్రీ అనుఘాదేవి సమేత విష్ణుదత్తస్వామి, శ్రీమతి జయలక్ష్మీ మాత, గురుదత్తపీఠం మొదలైనవి ఉన్నవి. స్వామివారి మాతృమూర్తి శ్రీమతి విజయలక్ష్మీ మాత ఈ ఆలయానికి రక్షణదేవతగా సుందవిగ్రహ రూపంలో ఇచ్చట దర్శనమిస్తుంది.

Laxmidevi Puja Friday, Godess Lakshmi Devi Pooja Benefits Friday, Friday Importance Lakshmi Devi Puja For Wealth

    ప్రతిరోజూ అమ్మవారికి సమప్రనామ, అష్టాత్తర పూజలు జరుగుతాయి. ఇంతే కాక శ్రావణమాసంలో శ్రీచక్రారార్చన, పౌర్ణమికి హోమం, పంచామృతాభిషేకాలతో అభిషేకాలు ఘనంగా జరుగుతాయి. అష్టలక్ష్ములలో శక్తికి ప్రతిరూపమైన గజలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేకంగా ఈ ఆలయంలో పూజాదికాలు ఘనంగా నిర్వహిస్తారు.