శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు .ఆ రాజ్యంలోఅందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది.ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి . ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు .

దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు .

MOHANPUBLICATIONS Ramachandrarao akula, [30.08.15 10:01]
ReplyDeletehttp://kinige.com/book/Sri+Durmukhi+Nama+Samvatsara+Kalachakram+Panchangam
MOHANPUBLICATIONS Ramachandrarao akula, [30.08.15 10:02]
http://kinige.com/book/Sankashtahara+Chaturdee+Sri+Mahaganapati+Vratamu
MOHANPUBLICATIONS Ramachandrarao akula, [30.08.15 10:03]
http://kinige.com/book/Bulli+Balasiksha
MOHANPUBLICATIONS Ramachandrarao akula, [30.08.15 10:03]
http://kinige.com/book/Kshetra+Namarchana