Friday, August 21, 2015

లక్ష్మీదేవి మీ ఇంట అడుగుపెట్టాలంటే..


దారిద్ర్యం తొలిగి లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టాలంటే ఏం చెయ్యాలి అనే సందేహం చాలామందికి వుంటుంది. ఇళ్లు, అలవాట్లలో వున్న దారిద్రమే అలక్ష్మీ నివాసం. అందుకే ఇల్లు పవిత్రంగా, పరిసరాలు శుభ్రంగా వుంటే లక్ష్మీదేవి నడిచి వస్తుంది. గుమ్మానికి ఎదురుగా చెప్పులు వుంటే ఇల్లు అందంగా వుండదు. చెప్పులకున్న చెడు వలన క్రిములు, కీటకాలు చేరుతాయి. అంతా చెత్తగా వున్నప్పుడు అనారోగ్యం, అనారోగ్యంతో డబ్బులు, ఆరోగ్యం మనశ్శాంతి పోతాయి. ఇంతకన్నా దారిద్య్రం ఏం వుంటుంది. అలాగే ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేయక పోవడం, చెత్త ఇంట్లోనే వుంచుకోవటం, అంట్లూ చాలా సేపు తోమకుండా వుండటం ఇవన్నీ లక్ష్మీ దేవి మన ఇంటికి రాకుండా అడ్డుపడే అంశాలే. ఆవిడ అపరిశుభ్రంగా వున్న ఇంట అడుగుపెట్టదు. లక్ష్మీదేవిని ఆహ్వానించాలన్నా, దరిద్ర దేవతను పారద్రోలాలన్నా శుభ్రత, నియమాలు పాటించడం ఒక్కటే మార్గం..

దీపం ఉన్న ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది


అన్ని పండుగలకి, మనం తలంట్లు పోసుకోటం, కొత్త బట్టలు కట్టుకోవటం, పిండివంటలు చేసుకోవటం, బంధు మిత్రులతో సరదాగా సమయాన్ని గడపటం ఉంటుంది కాని, ఈ పండుగకి వీటన్నిటితో పాటు ఇంకో ప్రత్యేకత ఉంది. అది `దీపాలు వెలిగించటం, టపాకాయలు కాల్చటం దీనికి సంబంధించి విష్ణుపురాణంలో ఒక కథ కనపడుతుంది` దీపావళి నాడు మహాలక్ష్మి విష్ణువుతో కలిసి విహారం చేయాలని కోరింది. అలా విహారం చేయటానికి బయలుదేరిన లక్ష్మీదేవి ఏ ఇంటిలో దీపాలు వెలుగుతున్నాయో, ఆ ఇంటిని అనుగ్రహించిందట మరి, ఇంకెం? మహాలక్ష్మి అనుగ్రహం కావాలనుకున్న వాళ్ళు అప్పటి నుంచి దీపావళి సాయంత్రం దీపాలు వెలిగించటం ప్రారంభించారు. లక్ష్మీదేవి తనవాహనమైన గుడ్ల గూబనెక్కి సూర్యా స్తమయసమయం, అనగా  సాయం సంధ్య లేక ప్రదోషళ వేళ నుండి అర్థ రాత్రి వరకు సంచారం చేసి దీపాలు వెలుగుతున్న ఇంట ప్రవేశించి అనుగ్రహిస్తుందని విష్ణుపురాణంలో ఉంది. 'దీపం పరబ్రహ్మ స్వరూపమే కాదు సమస్తమైన చీకట్లను పోగొడుతుంది. దాని వల్లనే అన్నింటినీ సాధించవచ్చు అట్టి సంధ్యా దీపమా నీకు నమస్కారము'' ''సమస్తమైన చీకట్లు అంటే భౌతికమైన చీకటి అనగా పగలు వెళ్ళిరాత్రి వచ్చినప్పుడంటే చీకటి ఒక్కటి కాదు అజ్ఞానము, పాపము, శోకము, మొదలైన సమస్తమైన జీవకోటికి హాని కలిగించే, ప్రగతి నిరోధకమైన అంశాలు. వాటినన్నింటినీ పోగొట్టేది దీప ప్రజ్జ్వలనంతో. మామూలు చీకట్లనే కాదు, అజ్ఞానం, దు:ఖం, శోకం, అలసత, రోగము, మాంద్యము, మృత్యువు మొదలైన వానినన్నింటిని పారద్రోలవచ్చును. అందుకు సహకరించేది  సంధ్యాదీపం. పగలు భగవంతుడిచ్చిన 'వెలుగు' (సూర్యుడు) తన సహస్ర కరాలతో అందరికీ వెలుగును పంచుతాడు, చీకట్లు పోగొట్టి కాని, ఆయన మరుగైనప్పుడు మానవుని శ్రేయమెట్లా అందుకోసం దయా మయుడైన కర్మసాక్షి తన తేజమును అగ్నియందుంచాడట. 'దీపాంతే నిహితం తేజస్సని త్రాణహుశన: ''ఆ అగ్నిదేవుని మన ఇంటి యందలి దీపమునందు ఆవాహన చేసినట్లయితే, ముల్లోకముల యందలి చీకట్లను పారద్రోలవచ్చట! ఎంతటి ఆశ! ఎంతటి హృద్యమైన భావన!! ఎంతటి మహోన్నత ఆశయం!!! ''సాజ్యం, త్రివర్తి సంయుక్తం, వహ్నినా యోజితం మయ గృహాణ మంగళం దీపం, త్రైలోక్యతి మిరాపహమ్‌'' ఇంతటి మహదాశయంతో, సద్భావనతో, సదుద్ధేశంతో, వెలిగించే దీపం లక్ష్మికి ప్రతిరూపం అవటం, దానిని చూసి లక్ష్మీదేవి అనుగ్రహించటం సమంజసమే. దీపాలని చూసి లక్ష్మి అనుగ్రహించటానికి కారణం మరొకటి కూడా, చాతుర్యాస్మ దీక్ష పాటించే నాల్గునెలలు శ్రీ మహావిష్ణువు నిదురించే సమయంగా చెపుతారు. చతుర్మాస్యం పూర్తి అయి శ్రీమహావిష్ణువు నిద్ర మేల్కొనే రోజుగా దీపావళిని చెపుతారు. ఆయన నిద్రలేవగానే కన్నులకు వెలుగు కనిపించాలి కనక దీపాలు వెలిగించాలట. దీపావళి మేల్కొనటానికి ముందు సమయం. దానికి ప్రతీకగా తెల్లవారు జామునే లేచి తులసమ్మ దగ్గర దీపం పెట్టటం అనే సంప్రదాయం ఏర్పడింది. దీనికీ ఒక పద్ధతుంది. తులసి పూజ అయినాక కృత్తిక నక్షత్రదర్శనం చేయాలంటారు. ఈనెల అంతా కృత్తికల పేరు గలది కదా! ఆ వివరాలు ఉపొద్ఘాతంలో చెప్పుకున్నాం. తులసి పూజ కార్తీక దామోదరునికి చేస్తారు. అంటే కార్తీక మాసాధిపతి అయిన విష్ణుమూర్తికి అన్నమాట. తెల్లవారుజామున దామోదరుని, పగలు శివుణ్ణి, సాయంత్రం లక్ష్మిని ఆరాధించాలి. 
ధన త్రయోదశి - శ్రీ మహాలక్ష్మి జన్మదినం ....
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో ఆ పాలసముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతే కాదు. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు, దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆ రోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా.,, ఎన్ని తెలివితేటలు ఉన్నా., శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీమహాలక్ష్మిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి, ఆమె ఆశీసులు అందుకుంటారు. శ్రీమహాలక్ష్మి .., ధనానికి ప్రతిరూపం. అందుకే., ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని..‘ధన త్రయోదశి’ అన్నారు.

ధనానికి అధిదేవత ‘శ్రీమహాలక్ష్మి.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.


అందుకే., ఈ ధనత్రయోదశి నాడు శ్రీమహాలక్ష్మితో పాటు కుబేరుని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా., ఈ లక్ష్మీ పూజను., సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తర్వాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఆశ్వయుజ మాసంలో వృషభలగ్నం రాత్రి సుమారు 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఉంటుంది. ఆ 2014 లో వృషభలగ్నం రాత్రి 7-17 నుంచి 9-17 వరకూ ఉంది. కనుక ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాలలో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ఏది ఏమైనా ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించే ఈ ధనత్రయోదశి., శ్రీమహాలక్ష్మి  జన్మ దినాన్ని భక్తులందరూ ఒక పండుగలా జరుపుకుంటారని ‘తెలుగు వన్’ ఆకాంక్షిస్తోంది.

శ్రావ‌ణ శుక్ర‌వారం - అమ్మ‌వారికి సొంతం !
చంద్రుడు శ్ర‌వణా న‌క్ష‌త్రాన‌ సంచరించే స‌మ‌యంలో వ‌చ్చే మాసాన్ని శ్రావ‌ణ‌ మాసం అంటారు. విశిష్ట‌మైన న‌క్ష‌త్రాల‌లో శ్ర‌వ‌ణ ఒక‌టి అని జ్యోతిషుల అభిప్రాయం. పైగా అది శ్రీమ‌హావిష్ణువుకి జ‌న్మ‌న‌క్ష‌త్రం. స‌క‌ల వ‌రాల‌నూ ఒస‌గే ఆ అనుగ్ర‌హ దంప‌తుల‌ని సేవించుకునేందుకు ఇంత‌కంటే గొప్ప స‌మ‌యం ఇంకేముంటుంది! `శ్ర‌వ‌ణం` అంటే విన‌డం అన్న అర్థం కూడా ఉంది క‌దా! ఈ మాసంలో త‌న‌ని సేవించే వారి మొర‌ల‌ను అమ్మ‌వారు త‌ప్ప‌క ఆల‌కిస్తార‌ని న‌మ్మ‌కం. అమ్మ‌వారు మ‌న మొర‌ల‌ను విన‌డ‌మే కాదు, పెద్ద‌లు చెప్పే అనుగ్ర‌హ భాష‌ణ‌లను మ‌నం విని ఆచ‌రించ‌డానికి కూడా ఇది గొప్ప స‌మ‌య‌మ‌ట‌! నూత‌న వ‌ధువు, అత్త‌వారింట అడుగుపెట్టాల‌న్నా; శుభ‌కార్యాలు చేప‌ట్టాల‌న్నా; గృహ‌నిర్మాణం వంటి ప‌నులు మొద‌లుపెట్టాల‌న్నా; నోములు ఆచ‌రించాల‌న్నా... శ్రావ‌ణ మాసం అత్యుత్త‌మం! అందులోనూ శ్రుక్ర‌వారం అంటే ఇక చెప్పేదేముంది. స్త్రీల‌కు అయిదోత‌నాన్నీ, అష్టైశ్వ‌ర్యాల‌నీ అందించే అమ్మ‌వారిని ఎంతో భ‌క్తితో కొలుచుకుంటారు. ఎప్ప‌టిలాగే త‌న చ‌ల్ల‌ని చూపుని త‌మ మీద నిలిపి ఉంచాల‌ని కోరుకుంటారు.
శ్రావ‌ణ శుక్ర‌వారం రోజున సూర్యోద‌యానికి ముందుగానే నిదుర‌లేని, అభ్యంగ‌న స్నాన‌మాచ‌రిస్తారు. ఇంటి గ‌డ‌ప‌ల‌కు ప‌సుపు, కుంకుమ‌ల‌ను అద్దుతారు. అమ్మ‌వారిని ఫ‌ల‌పుష్పాల‌తో పూజించి... పాయసం, చ‌క్కెర‌పొంగ‌లి, ప‌ర‌మాన్నం వంటి నైవేద్యాల‌ను అందిస్తారు. వీటితోపాటు పూర్ణంబూరెల‌ను కూడా ప్ర‌సాదంగా వండితే మంచిదంటారు పెద్ద‌లు. ఇక మ‌ధ్యాహ్నం భోజ‌నానికి ఒక ముత్తయిదువను ఆహ్వానిస్తారు. ఆమెను సాక్షాత్తూ ల‌క్ష్మీదేవిగా భావించి, భోజ‌నాది స‌త్కారాల‌తో సేవించి, తాంబూలంతో పాటు నూత‌న వస్త్రాల‌ను అందిస్తారు. సాయంత్రం వేళ ముత్తయిదువల‌ను పేరంటానికి పిలిచి శ‌న‌గ‌లు, త‌మ‌ల‌పాకు, వ‌క్క‌, అర‌టిపండుల‌తో కూడిన తాంబూలాన్ని అందించి... త‌మకి ఆశీర్వాద బ‌లాన్ని అందించ‌వ‌ల‌సిందిగా వేడుకుంటారు. సాధార‌ణంగా శ్రావ‌ణ మాసంలో వ‌చ్చే రెండో శుక్ర‌వారంనాడు ఆడ‌వారు వ‌ర‌ల‌క్ష్మీవ్ర‌తాన్ని ఆచ‌రిస్తారు. అయితే రెండో వారం ఏద‌న్నా అవాంత‌రం వ‌స్తుంద‌నుకునే వారు అప్ప‌టివ‌ర‌కూ వేచి ఉండ‌కుండా తొలి శుక్ర‌వారంలోనే ఈ వ్ర‌తాన్నీ ఆచ‌రిస్తారు. వ‌రాల‌ని ఒస‌గేందుకు ఆ త‌ల్లి సిద్ధంగా ఉంటే ప్ర‌తి శుక్ర‌వార‌మే వ‌ర‌ల‌క్ష్మిదే క‌దా!

శ్రావణమాసం.. శుభప్రదం.. మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మాసం

మహిళలు అత్యంత పవిత్రంగా భావించే మాసం శ్రావణమాసం. ఈ మాసంలో వ్రతాలు, పూజలు, ఉపవాసాలు నిష్ఠగా చేస్తే అన్నీ శుభాలే జరుగుతాయని నమ్మకం. ఈ మాసంలో వరలక్ష్మీ వ్రతం, గౌరీవ్రతం, నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, కృష్ణాష్ణమి వంటి పర్వదినాలు ఉన్నాయి. ఈ నెలంతా మాంసాహారం భుజించరు. మహావిష్ణువుకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసం. 
varalakshmi vratham


ఈ మాసంలో పూజలు, వ్రతాలు చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని ప్రతి ఒక్కరూ నమ్మకం. ఈ మాసంలోనే ఎక్కువ శుభకార్యాలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా మహిళలు మంగళ, శుక్రవారాల్లో మంగళగౌరీ నోములు చేస్తుంటారు. సోమ, గురు, శనివారాల్లో ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. శ్రావణమాసానికి ముందు వివాహం చేసుకున్న నూతన దంపతులు పుట్టకు పాలుపోసి పూజలు చేస్తారు. 
 
శ్రావణ మాసంలోనే అనేక పర్వదినాలు వస్తుంటాయి. ఇందులో భాగంగా ఈనెల 18వ తేదీన మంగళగౌరీ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో చేస్తారు. దాంపత్య జీవితం నిండు నూరేళ్ళు సౌభాగ్యవంతంగా ఉండాలని, మంచి సంతానం కలగాలని, నూతన వధూవరులు ఈ వ్రతాన్ని చేస్తారు. 19న నాగుల పంచమి. దీన్ని శ్రావణశుద్ధ పంచమిరోజున నిర్వహిస్తారు. ఈ రోజన పుట్టలో పాలుపోసి నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
 
ఆగస్టు 28వ తేదీ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చేది. అష్టైశ్వర్యాలు ప్రసాదించి సౌభాగ్యంతో వర్థిల్లాలని కోరుకునే వారు శుక్రవారం ప్రత్యేక పూజలు చేస్తుంటారు. ఈ వ్రతాన్ని మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆగస్టు 29వ తేదీన రక్షాబంధన్. సోదరీ.. సోదరీమణుల బంధానికి ప్రతీకగా ఈ పండుగ నిర్వహిస్తారు. 

లక్ష్మి

శ్రీ లక్ష్మి
Raja Ravi Varma, Goddess Lakshmi, 1896.jpg
సిరుల తల్లి
దేవనాగరి:लक्ष्मी
తెలుగు:శ్రీ లక్ష్మి
నివాసం:వైకుంఠం
పతి / పత్ని:శ్రీమహావిష్ణువు
వాహనం:గుడ్లగూబ

హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రోవు, అర్ధంపు బెన్నిక్క, చందురు తోబుట్టువు, భారతీ గిరిసుతల్‌తో నాడు పూబోడి, తా
మరలందుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్ !
లక్ష్మి (Lakshmi) లేదా మహాలక్ష్మి లేదా శ్రీ హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖసంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తిలలో ఒకరైన విష్ణువు నకు ఇల్లాలు.భృగు పుత్రిక అయిన లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీర సాగరమథన సమయంలో ఉద్భవించినది. జైనమతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్టనష్టాలనుండి కాపాడి వారికి సిరిసంపదలను కలుగజేస్తుంది.
సంస్కృతంలో "లక్ష్మి" అన్న పదానికి మూల ధాతువులు - లక్ష్ - పరిశీలించుట, గురి చూచుట . ఇదే ధాతువును "లక్ష్యం" అనే పదంలో కూడా చూస్తాము. వేదాలలో లక్ష్యాయిధి లక్ష్మిః - అనగా జనులను ఉద్ధరించే   లక్ష్యం కలిగినది - అని అన్నారు.

మహాలక్ష్మిని శ్రీ అని కూడా అంటారు. తమిళంలో తిరుమగళ్ అంటారు. ఆమె ఆరుసుగుణములు పరిపూర్ణముగా కలిగినది. నారాయణుని శక్తికి ఆమెయే కారణము. ఆమె విష్ణువునకు ఇల్లాలు[2]సీతగా రాముని పెండ్లాడినది. రాధ,రుక్మిణి మరియు శ్రీకృష్ణుని భార్యలందరును లక్ష్మీదేవి అంశలే[3][4][5] [6]

బెంగాల్‌లో దుర్గాపూజ సమయంలో లక్ష్మిసరస్వతివినాయకుడుకార్తికేయుడు - వీరందరినీ దుర్గామాత బిడ్డలుగా ఆరాధిస్తారు.[7]

హిందూ సంప్రదాయంలో స్థానం


హళేబీడులో లక్ష్మీ నారాయణుల శిల్పాలు.
హిందూమతంలో వైదికకాలంనుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నదనడానికి ఆధారాలున్నాయి. ఋగ్వేద కాలంలో అదితి, రాకా, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా, సంప్త్పదాయినులుగా ఆరాధించారు. అధర్వణ వేదం "సినీవాలి" అనే దేవతను "విష్ణుపత్ని"గా నుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృరూపమో తెలియడంలేదు.[8]

ప్రధాన గాధలు

లక్ష్మీ దేవి గురించి వివిధ గాధలు పురాణాలలోను, ఇతిహాసాలలోను ఉన్నాయి. శ్రీ మహా విష్ణువునకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె 'నిత్యానపాయిని' (ఎన్నడూ విడివడనిది), లక్ష్మీనారాయణులు వేరు వేరు కారని అని శ్రీవైష్ణవ సంప్రదాయంలో చెబుతారు.

సృష్ట్యాదిలో దేవి (మహాశక్తి) సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవీ భాగవతం లో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువునుండి వేరు కావడం వలన విష్ణువు శక్తి హీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు, ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగువు విష్ణువుకు ఇచ్చి పెండ్లి చేశాడు. కనుక లక్ష్మిని 'భార్గవి' అని కూడా అంటారు.

తరువాత ఒకమారు దూర్వాసుని శాపకారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు రాక్షసులు పాలసముద్రన్ని మందర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు త్రాటిగాచేసె చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాలసముద్రం నుండి కామదేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మిదేవి అవతరించింది. పాలసముద్రలో నుండి జనించింది కనుక ఆమె 'సముద్రరాజ తనయ' అయ్యింది. ఆమెతో బాటే జన్మించిన చంద్రుడు లక్ష్మికి సహోదరుడయ్యాడు. ధనాధి దేవత ఐయిన ఈ దేవిని శ్రీమహావిష్ణువు పత్నిగా స్వీకరిచాడు.[9][10]

విష్ణువు శక్తికి, మాయకు కారణం ఆయనకు లక్ష్మి తోడుండడమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశ అని చెబుతారు. దేవీ మహాత్మ్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది.[11] ఆమెను అష్ట భుజ మహాలక్ష్మిగా వర్ణించారు.

విష్ణువు అవతారాలతోబాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారం లో సీత గా, కృష్ణావతారం లో రుక్మిణి గా, కలియుగంలో వెంకటేశ్వర స్వామి కి తోడుఅలమేలు మంగ గా లక్ష్మి విష్ణువుకు తోడై ఉంది.

వివిధ నామాలు


లక్ష్మి రూప చిత్రణ
చాలా మంది దేవతలకు వలెనే లక్ష్మికి ఎన్నో పేర్లు, అష్టోత్తర శతనామ స్తోత్రం , సహస్ర నామ స్తోత్రం వంటివి ఉన్నాయి. అధికంగా లక్ష్మిని సంబోధించే నామాలలో కొన్ని - లక్ష్మి, శ్రీ, సిరి, భార్గవి, మాత, పలుకు తేనెల తల్లి (అన్నమయ్య సంబోధన), నిత్యానపాయిని, క్షీర సముద్ర రాజ తనయ, పద్మ, పద్మాక్షి, పద్మాసన, కమల, పద్మప్రియ, రమ, ఇందిర.

లక్ష్మి రూప చిత్రణ

అధికంగా లక్ష్మీదేవి చతుర్భుజాలతోను, ధన కుంభంతోను, పద్మాసనగా, పద్మాలను చేతబట్టి, సకలాభరణ భూషితయైనట్లుగా చిత్రించబడుతుంది. లక్ష్మీ దేవి వాహనంగుడ్లగూబ.

వాఙ్మయాధారాలలో ఋగ్వేదం పదవ మండలంలోని శ్రీసూక్తం సర్వ శుభ లక్షణ నిలయ, సకల సంపత్ప్రదాయిని అయిన లక్ష్మీదేవి స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్నది. ఆమె బంగారు మేనికాంతి కలది (హిరణ్యవర్ణాం), బంగారు ఆభరణములు దాల్చినది (సువర్ణ రజతస్రజాం), వెన్నెలలా మెరుస్తున్నది (చంద్రాం), గజరాజుల ఘీంకారములతో సంబోధింపబడుచున్నది (హస్తినాద ప్రబోధినీం), చిరునగవులు చిందించునది (కాంసోస్మితాం), కీర్తిచే శోభిల్లునది (యశసా జ్వలన్తీం), సకల దారిద్ర్యములను నశింపజేయునది (అలక్ష్మీర్మే నశ్యతాం), పద్మమాలను ధరించినది (పద్మమాలినీం), పద్మమునుండి జనించినది (పద్మోద్భవాం), అందరికి ప్రీతిపూర్వకమైన మాత (ప్రజానాం భవసి మాతా).


రంగాపురం దేవాలయంలో లక్ష్మి ప్రతిమ
యజుర్వేదం పురుష సూక్తం లో శ్రీ, లక్ష్మీ అనే ఇరువురు దేవతలు నారాయణునికి దేవేరులుగా పేర్కొనబడ్డారు. తైత్తరీయారణ్యకం , వాజసనేయ సంహిత లలో ఈ ఇద్దరు దేవతలు స్తుతించబడ్డారు. పురాణయుగంలో మత్స్య, విష్ణు, విష్ణు ధర్మోత్తర పురాణాలలో లక్ష్మీదేవి అపూర్వ సౌందర్యమూర్తి, అద్భుత శక్తి సమన్వితగా కీర్తించబడింది. లక్ష్మీదేవి ప్రతిమను శిల్పీకరించే విధానాన్ని మత్స్య పురాణం లో ఇలా చెప్పారు - "దేవి ప్రతిమ యౌవనాకృతి కలిగి ఉండాలి. దళసరి చిబుకములు, ఎర్రని పెదవులు, చక్కని కనుబొమలు కలిగి సర్వాభరణములు ధరించి ఉండవలెను. ముఖం గుండ్రంగా ఉండాలి. దివ్యాంబరమాలా కంకణధారియై యండాలి. ఎడమచేతిలో పద్మం, కుడిచేతిలో బిల్వఫలాలు ఉంచాలి. పద్మాసీనయైన దేవి చుట్టుప్రక్కల నల్ల తుమ్మెదలు తిరుగాడుచున్నట్లుగాను, ఇరువైపుల తొండములయందలి పాత్రలతో అభిషేకించు గజరాజులను, ప్రణమిల్లు గంధర్వ గుహ్యకులను చిత్రించాలి. అగ్ని పురాణం ప్రకారం శ్రీమాత శంఖ-చక్ర-గదా-పద్మ-ధారిణి. విష్ణుధర్మోత్తర పురాణానుసారం దేవి విష్ణుసహితయైనప్పుడు ద్విభుజయై పద్మమునుదాల్చి సర్వాభరణభూషితయై యుండును. స్వతంత్రమూర్తిగా మలచినపుడు చతుర్భుజయై, ఉన్నత సింహాసనాసీనయై, పద్మము, అమృతపాత్ర, బిల్వఫలములు, శంఖములు దాల్చి గజములచే అభిషేకింపబడుచున్నట్లు చూపవలెను. శిరస్సుమీద సువికసిత పద్మములుండవలయును. అమ్మవారి చేతనున్న శంఖము అదృష్టమును, బిల్వఫలములు ప్రపంచమును, పద్మము సంపదను సూచించును. రెండు గజములు శంఖ పద్మనిధులకు సూచకములని విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది. వరాహమిహిరుని బృహత్సంహితలో దేవతా ప్రతిమల ఆకృతులు వివరంగా చెప్పబడినవి కాని లక్ష్మీదేవి ఆకృతిగురించి చెప్పలేదు. కారణం తెలియడంలేదు.[8]

అష్ట లక్ష్ములు
లక్ష్మీ దేవి వివిధ రూపాలలో అష్టలక్ష్ములు ప్రసిద్ధం. వారు - ఆదిలక్ష్మి, ధైర్య లక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతాన లక్ష్మి, విజయ లక్ష్మి, విద్యాలక్ష్మి, ధన లక్ష్మి - ఆయా రూపాలలో ఆ దేవి ఆయా ఫలితాలను ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

ఇతర మతాలు, సంప్రదాయాలు

జైన, బౌద్ద కళలలో కూడా లక్ష్మీదేవి రూపకల్పన కొన్నిచోట్ల గమనించవచ్చును. గ్రీకు పురాణ దేవత ఆఫ్రొడైట్ మరియు రోమన్ పురాణ దేవత వీనస్ ల స్వరూప, కథాంశాలలోను లక్ష్మి స్వరూప కథాంశాలలోను కొంత సారూప్యత కనిపిస్తుంది.
బౌద్ధమతం సాహిత్యంలో మిళింద, పన్హ, సిరికాలకణ్ణి జాతక కథము, ధమ్మపధ అట్టకథలు శ్రీమాతను "సిరిమా" దేవతగా పేర్కొన్నాయి. ఆ కథల ప్రకారం ఆమె సౌందర్య, అదృష్ట, ప్రజ్ఞా శక్తులు ప్రసాదించే కరుణాంతరంగ. జైనమతం కల్పసూత్రం ప్రకారం వర్ధమాన మహావీరుడు జన్మించడానికి ముందు అతని తల్లికి కలిగిన స్వప్నాలలో శ్రీమాత కూడా ఉంది.సింధులోయ నాగరికత కు సంబంధించి లభించిన ప్రతిమలలో ఆభరణ భూషితలైన మాతృదేవతల ప్రతిమలున్నాయి. మౌర్యుల కాలానికి చెందిన కొన్ని శిల్పాలలో కూడా అలాంటి మాతృదేవతామూర్తులున్నాయి. ఈ మూర్తులే లక్ష్మీదేవి రూపానికి స్ఫూర్తినిచ్చి ఉండవచ్చును. [8]

పూజలు, ఆచారాలు

దీపావళి
శుక్రవారం
శ్రావణ శుక్రవారం (వరలక్ష్మీ వ్రతం)

ప్రార్ధనలు

లక్ష్మి దేవిని స్తుతించేందుకు పురాతనమైనవి, ఆధునికమైనవి అనేక ప్రార్ధనలు, గానాలు, పద్యాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని:
మహాలక్ష్మ్యష్టకం
శ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రము - శ్రీ లక్ష్మీ అష్టోత్తర శత నామ స్తోత్రము
దేవ్యువాచ
దేవదేవ! మహాదేవ! త్రికాలఙ్ఞ! మహేశ్వర!
కరుణాకర దేవేశ! భక్తానుగ్రహకారక! ||
అష్టోత్తర శతం లక్ష్మ్యాః శ్రోతుమిచ్ఛామి తత్త్వతః ||
ఈశ్వర ఉవాచ
దేవి! సాధు మహాభాగే మహాభాగ్య ప్రదాయకమ్ |
సర్వైశ్వర్యకరం పుణ్యం సర్వపాప ప్రణాశనమ్ ||
సర్వదారిద్ర్య శమనం శ్రవణాద్భుక్తి ముక్తిదమ్ |
రాజవశ్యకరం దివ్యం గుహ్యాద్-గుహ్యతరం పరమ్ ||
దుర్లభం సర్వదేవానాం చతుష్షష్టి కళాస్పదమ్ |
పద్మాదీనాం వరాంతానాం నిధీనాం నిత్యదాయకమ్ ||
సమస్త దేవ సంసేవ్యమ్ అణిమాద్యష్ట సిద్ధిదమ్ |
కిమత్ర బహునోక్తేన దేవీ ప్రత్యక్షదాయకమ్ ||
తవ ప్రీత్యాద్య వక్ష్యామి సమాహితమనాశ్శృణు |
అష్టోత్తర శతస్యాస్య మహాలక్ష్మిస్తు దేవతా ||
క్లీం బీజ పదమిత్యుక్తం శక్తిస్తు భువనేశ్వరీ |
అంగన్యాసః కరన్యాసః స ఇత్యాది ప్రకీర్తితః ||
ధ్యానమ్
వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణైః నానావిధైః భూషితామ్ |
భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాధిభిస్సేవితాం పార్శ్వే పంకజ శంఖపద్మ నిధిభిః యుక్తాం సదా శక్తిభిః ||
సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే |
భగవతి హరివల్లభే మనోఙ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్ ||
ఓం ప్రకృతిం, వికృతిం, విద్యాం, సర్వభూత హితప్రదామ్ |
శ్రద్ధాం, విభూతిం, సురభిం, నమామి పరమాత్మికామ్ || 1 ||
వాచం, పద్మాలయాం, పద్మాం, శుచిం, స్వాహాం, స్వధాం, సుధామ్ |
ధన్యాం, హిరణ్యయీం, లక్ష్మీం, నిత్యపుష్టాం, విభావరీమ్ || 2 ||
అదితిం చ, దితిం, దీప్తాం, వసుధాం, వసుధారిణీమ్ |
నమామి కమలాం, కాంతాం, క్షమాం, క్షీరోద సంభవామ్ || 3 ||
అనుగ్రహపరాం, బుద్ధిం, అనఘాం, హరివల్లభామ్ |
అశోకా,మమృతాం దీప్తాం, లోకశోక వినాశినీమ్ || 4 ||
నమామి ధర్మనిలయాం, కరుణాం, లోకమాతరమ్ |
పద్మప్రియాం, పద్మహస్తాం, పద్మాక్షీం, పద్మసుందరీమ్ || 5 ||
పద్మోద్భవాం, పద్మముఖీం, పద్మనాభప్రియాం, రమామ్ |
పద్మమాలాధరాం, దేవీం, పద్మినీం, పద్మగంధినీమ్ || 6 ||
పుణ్యగంధాం, సుప్రసన్నాం, ప్రసాదాభిముఖీం, ప్రభామ్ |
నమామి చంద్రవదనాం, చంద్రాం, చంద్రసహోదరీమ్ || 7 ||
చతుర్భుజాం, చంద్రరూపాం, ఇందిరా,మిందుశీతలామ్ |
ఆహ్లాద జననీం, పుష్టిం, శివాం, శివకరీం, సతీమ్ || 8 ||
విమలాం, విశ్వజననీం, తుష్టిం, దారిద్ర్య నాశినీమ్ |
ప్రీతి పుష్కరిణీం, శాంతాం, శుక్లమాల్యాంబరాం, శ్రియమ్ || 9 ||
భాస్కరీం, బిల్వనిలయాం, వరారోహాం, యశస్వినీమ్ |
వసుంధరా, ముదారాంగాం, హరిణీం, హేమమాలినీమ్ || 10 ||
ధనధాన్యకరీం, సిద్ధిం, స్రైణసౌమ్యాం, శుభప్రదామ్ |
నృపవేశ్మ గతానందాం, వరలక్ష్మీం, వసుప్రదామ్ || 11 ||
శుభాం, హిరణ్యప్రాకారాం, సముద్రతనయాం, జయామ్ |
నమామి మంగళాం దేవీం, విష్ణు వక్షఃస్థల స్థితామ్ || 12 ||
విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ |
దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ || 13 ||
నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ |
త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || 14 ||
లక్ష్మీం క్షీరసముద్రరాజ తనయాం శ్రీరంగధామేశ్వరీమ్ |
దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురామ్ ||
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్-బ్రహ్మేంద్ర గంగాధరామ్ |
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియామ్ || 15 ||
మాతర్నమామి! కమలే! కమలాయతాక్షి!
శ్రీ విష్ణు హృత్-కమలవాసిని! విశ్వమాతః!
క్షీరోదజే కమల కోమల గర్భగౌరి!
లక్ష్మీ! ప్రసీద సతతం సమతాం శరణ్యే || 16 ||
త్రికాలం యో జపేత్ విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః |
దారిద్ర్య ధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్-యయత్నతః |
దేవీనామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 17 ||
భృగువారే శతం ధీమాన్ పఠేత్ వత్సరమాత్రకమ్ |
అష్టైశ్వర్య మవాప్నోతి కుబేర ఇవ భూతలే ||
దారిద్ర్య మోచనం నామ స్తోత్రమంబాపరం శతమ్ |
యేన శ్రియ మవాప్నోతి కోటిజన్మ దరిద్రతః || 18 ||
భుక్త్వాతు విపులాన్ భోగాన్ అంతే సాయుజ్యమాప్నుయాత్ |
ప్రాతఃకాలే పఠేన్నిత్యం సర్వ దుఃఖోప శాంతయే |
పఠంతు చింతయేద్దేవీం సర్వాభరణ భూషితామ్ || 19 ||
  ఇతి శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం సంపూర్ణమ్


Lakshmi Gif Images