Tuesday, September 8, 2015

లక్ష్మిపూజ ఎలా చేయాలి ?

లక్ష్మిపూజ ఎలా చేయాలి ?

హిందువులు ప్రత్యేకంగా లక్ష్మీపూజ చేసే సందర్భాలు కొన్ని ఉన్నాయి. దీపావళి రోజున అలాగే, శ్రావణమాసంలో. శ్రావణమాసంలోని ప్రతిరోజూ లక్ష్మీపూజ చేయవచ్చు. అయితే దీపావళి రోజు, శ్రావణమాసంలోనూ ఏకరీతిని లక్ష్మీపూజ ఎలా చేయవచ్చు అంటే...
శ్రీ సూక్త మంత్రాలతోకానీ, లక్ష్మీ సహస్ర నామాలతో కానీ, లక్ష్మి ఆశతో అష్టోత్తర శత నామాలతో కానీ లక్ష్మిదండకం లేదా స్తుతితో కానీ లక్ష్మీదేవిని అర్పించాలి. లక్ష్మీదేవిని పూజించే రోజున ఇంటిని శుభ్రంగా కడిగి, తుడిచి ఇంటిమధ్యలో ధాన్యాన్ని రాసిగా పోసి, దానిమీద తెల్లని వస్త్రాన్ని కప్పి, ఆ వస్త్రం మీద లక్ష్మి విగ్రహాన్ని ఉంచి, ఆమెకి ఇష్టమైన తెల్లని పూలు, తెల్లని గంధము, తెల్లని వస్త్రాలు, ముత్యాలు మొదలైన వాటితో

నరసిజనిలయే! సరోజ హస్తే
దవళ తామాంశుక గంధామాల్య శోభే

భగవతి హరివల్లభే! మనోజ్ఞే
త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్

అంటూ పూజించవచ్చు. పై పద్యంలోని భావం ఏమిటంటే...
పద్మమే నివాసంగా కలదానా, పద్మాన్ని నీ చేతిలోని ఆభరణంగా ధరించిన దానా, మిక్కిలి తెల్లనైన వస్త్రాలను, గంధాన్ని మాలికలుగా వేసుకుని రమణీయంగా ఉండేదానా! శ్రీహరికి భార్యవైనదానా! నా మనసులోని భావాన్ని గ్రహించిన దానా, త్రిభువనాలకీ సంపదనిచ్చే తల్లీ నన్ను రక్షించు అని భావం.

లక్ష్మి కటాక్షం కోసం భగవద్గీత పారాయణ చేయాలని శాస్త్రం చెబుతోంది. భగవద్గీతలో అధ్యాయాల సంఖ్య 18. అయ్యప్ప ఆలయంలోని పడిమెట్ల సంఖ్య కూడా 18. ఈ 18 సంఖ్యకు ఉన్న విశిష్టత ఏమిటంటే... ఆ సంఖ్యలోని మొదటి అంకెను, రెండవ అంకెను కలిపితే తొమ్మిది వస్తుంది. ఈ తొమ్మిది అనే సంఖ్య మనిషిలోని చెడును, పాపాలను నాశనం చేస్తుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. భగవద్గీత పారాయణ కానీ, అయ్యప్ప దీక్ష 41 కానీ చేసినట్టయితే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పద్మపురాణం చెబుతోంది.

యాదేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా
నానాస్తస్యై నమో నమః

దీపం జ్యోతి పరబ్రహ్మ, దీపం సర్వతమోపహరమ్
దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీప నమోస్తుతే...

ఈ పద్యం భావం ఏమిటంటే..

దీపం చీకటిని నశింపచేస్తుంది. జ్ఞానదీపం అంధకారాన్ని నశింపచేస్తుంది. బాహ్య అంధకారాన్ని అంతర్యముగా ఉండే అజ్ఞానాన్ని పోగొట్టేది జ్ఞానజ్యోతి. అటువంటి జ్ఞానజ్యోతికి నమస్సులు. అష్టలక్ష్ముల వైభవంతోనే జగత్తు తేజోమయం అయ్యింది. ఈ అష్టలక్ష్మి శక్తిలేని చోటు ప్రపంచంలో మనకు కనిపించదు. ఈ శక్తులన్నిటినీ అధిదేవత లక్ష్మీదేవే. అందుకే ఆమెను పూజించాలి. ఆమె కటాక్షం పొందాలి.

నమస్తే సర్వలోకానాం జననీమజ్జసంభవామ్
శ్రియమున్నిద్ర పద్మాక్షిం విష్ణువక్షః స్థితామ్

లక్ష్మిదేవి క్షీర సముద్రం నుండీ ఉద్భవించినప్పుడు దేవతలందరూ ఆమెను ఈ శ్లోకంతో స్తుతించారు. వారి స్తుతులకు ప్రసన్నురాలైన లక్ష్మీదేవి, వారిని వరం కోరుకోమనగా, అప్పుడు దేవతలు ఈ స్తోత్రం పఠించినవారిని విడువవద్దని ఇంద్రుడు కోరాడు. ఆమె ఆ వరాన్ని అనుగ్రహించింది. ఈ శ్లోకాన్ని పఠిస్తూన్నవారింట లక్ష్మీదేవి కొలువై ఉంటుందన్న నమ్మకం ఉంది.

శ్రీ లక్ష్మీకవచమ్ (శుకం ప్రతి బ్రహ్మప్రోక్తమ్ )

శ్రీ లక్ష్మీకవచమ్ (శుకం ప్రతి బ్రహ్మప్రోక్తమ్ ) 

 
అస్యశ్రీ మహాలక్ష్మి కవచ మహామంత్రస్య బ్రహ్మఋషిః!
అస్యశ్రీ మహాలక్ష్మిర్దేవతా! శ్రీ మహాలక్ష్మా: ప్రీత్యర్దే
లక్ష్మీకవచ స్తోత్ర జపే నివియోగః!

శ్లో!! మహాలక్ష్మా: ప్రవక్ష్యామి, కవచం సర్వకామదం!
సర్వపాప ప్రశమనం, దుష్టవ్యాధి వినాశనమ్!!
శ్లో!! గ్రహపీడా ప్రశమనం, గ్రహారిష్ట ప్రభంజనం!
దుష్ట మృత్యు ప్రశమనం, దుష్టదారిద్ర్య నాశనమ్!!
శ్లో!! సావధాన మనా భూత్వా, శ్రణుత్వం శుకసత్తమ!
అనేక జన్మ సంసిద్ధిం లభ్యం ముక్తి ఫలప్రదమ్!!
శ్లో!!ధన ధాన్య మహారాజ్య, సర్వసౌభాగ్య కల్పకం!
సకృత్స్మరణ మాత్రేణ, మహాలక్ష్మి: ప్రసీదతి!!
శ్లో!! క్షిరాబ్ది మధ్యే పద్మానాం, కాననే మణి మంటపే!
తన్మధ్యే సుస్థితాం దేవీం, మనీషిజన సేవితామ్!!
శ్లో!! సుస్నాతాం పుష్పసురభి, క్లుటిలాలక బన్దనాం!
పూర్ణేస్తు బిమ్చ వదనా మర్ధ చస్ద్ర లలాటికమ్!!
శ్లో!! ఇందీవరేక్షణాం కామ, కోదండ భ్రవన్మీశ్వరం!
తిల ప్రసవ సంస్పర్ది, నాసికాలంకృతాం శ్రియమ్!!
శ్లో!! కుంద కట్మల దన్తాం, తాం హన్దూకాధర పల్లవాం!
దర్పణాకార విమల. కపోల ద్వితయోజ్ఞ్వలామ్!!
శ్లో!! రత్నతాటంక విలసత్, కర్ణ ద్వితయ సుందరాం!
మాంగల్యా భారనోపేతాం, కంబుకంఠీం జగత్ప్రసూమ్!!
శ్లో!!తారహారి మనిహరి, కుచకుంభ విభూషితామ్!
రత్నాంగదాది విలసత్, కర పద్మ చతుష్టయామ్!!
శ్లో!! కమలే చ సు పత్రాధ్యే, హృభయం దధతీం పరం!
రోమరాజికలాచారు, భుగ్ననాభి తలోదరీమ్!!
శ్లో!! పట్టు వస్త్ర సముద్భాసి, సు నితమ్భాది లక్షణాం!
కంచన స్తంభ విభ్రాజ ద్వారసూరు సుశోభితామ్!!
శ్లో!!స్మర కాహలికాగర్వ, హరి జంఘాం హరిప్రియాం!
కమరీ వృష్ట సదృశ, పాదాబ్జాం చన్ద్ర సంనిభామ్!!
శ్లో!! పంకజోదర లావణ్య, సుందరాంఘ్రితలాం శ్రియం!
సర్వాభరణ సంయుక్తాం, సర్వలక్షణ లక్షితామ్!!
శ్లో!! పితామహ మహాప్రీతాం, నిత్యతృప్తాం హరిప్రియాం!
నిత్యం కారుణ్యం లలితాం, కస్తూరీం లేపితాంగికామ్!!
శ్లో!! సర్వమంత్ర మయిం లక్ష్మీం, శృతిశాస్త్ర స్వరూపిణిం,
పరబ్రహ్మ మయిం దేవీం, పద్మనాభ కుటుంబినీమ్.
ఏవం ధ్యాత్వా మహాలక్ష్మీం పఠేత్ కవచం వరమ్!!
- See more at: http://www.teluguone.com/devotional/content/srilakshmee-kavacham-88-1560.html#sthash.mDJ2dZh2.dpuf

లక్ష్మీ ధ్యానమ్

లక్ష్మీ ధ్యానమ్ 

 
పద్మనాభ ప్రియాం దేవీం పద్మాక్ష్మీం పద్మవాసినీం
పద్మవక్త్రాం పద్మహస్తాం వందే పద్మా మహర్నిశం
పూర్ణేందు బింబవదనాం రత్నాభరణభూషితాం
వరదాభయహస్తాడ్యాం ధ్యాయేచ్చంద్రసహోదరీమ్

ఇచ్చారూపాం భగవతస్సచ్చిదానందరూపిణిం
దయాళుమనిశం ధ్యాయేత్సుఖసిద్ధి స్వరూపిణిం
వందే పద్మకరాం ప్రసన్న వదనాం సౌభాగ్యదాంభాగ్యదాం,
హస్తాభ్యామభయప్రదాం మణిగనైర్నానావి ధైర్భూషితాం

భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాది భిస్సేవితాం
పార్శ్వే పంకజ శంఖపద్మనిదిభిర్యుక్తాం సదా శక్తిభి:
సరసిజనయనే, సరోజ హస్తే, ధవళతరాం శుకగంధమాల్యం శోభే
భగవతి, హరివిల్లభే, మనోజ్ఞే, త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం

మహాకన్యాసరస్వతి, మహాలక్ష్మీర్మహాకాళీ, నిత్యానందా, నిత్యబోధా, నాదినీ
జనామోదినీ, వాగీశ్వరీ, సిద్ధలక్ష్మీ, క్రియాలక్ష్మీ, మోక్షలక్ష్మి, గాయత్రీ
సోమసంభూతి, సావిత్రి వైదికీ దేవీ శౌరీ రూపాధికాతిభా, నారాయాణీ, లాభకారిణీ,
గ్రహ నక్షత్ర రూపిణీ వైష్ణవీ, బిందునాదకళాతీతా, బిందునాద కళాత్మికా,

చక్రరూపిణీ, చింతామణి, శ్చిదానంచా, పంచబాణ ప్రబోధినీ, భువనేశ్వర, విద్యా కేతకీ
మల్లికా శోకా, వారాహీ ధరణీ ధ్రువా, బాదబ్రహ్మ మయీ విద్యా, జ్ఞాన బ్రహ్మమయీ పరా,
బ్రహ్మనాడీ, బడబాగ్నిశిఖా హేమామాలాశిఖామాలా, సర్వాంతర్యామి రూపిణి
సుమంగళా, సంపన్నా సాక్షాన్మంగళదేవతా, మహాదుర్గా మహోత్సాహాదేవ బలోదయా

మానసీ హంసీ, హంసలోక ప్రదాయనీ, చిన్ముద్రాలంకృతకరా కోటి సూర్యసమప్రభా,
సుఖప్రాణిశిరోరేఖా, కలిదోష ప్రశమనీ, కోలాపుర స్స్థితా, గౌరీ లాక్షణికీ ముఖ్యాజఘన్యా,
కృతవర్జితా మాయా విద్యా మూలాభూతా వాసవీ విష్ణు, చేతనా పీతాంబరమయీ,
చంచత్కౌస్తుభాహరికామినీ, రమా రామారమణీ మృత్యుభంజనీ, మిత్రవిందాచ శేష్య
శేషకళాశయా, నమస్తే సర్వలోకానాం జనన్యై పుణ్యమూర్తయే

సిద్ధలక్ష్మీర్మహాకాళీ, మహాలక్ష్మి, నమోస్తుతే, పంచాగ్నిరూపా పంకపంచకా, యంత్రలక్ష్మీ,
నవకోటి మహాశక్తి సముపాస్య పదాంబుజే, కనకత్సౌ వర్ణ రత్నాడ్య సర్వాభరణభూషితే,
అనంతసత్య మహిషి ప్రపంచేశ్వరనాయకి,శ్రీరమ్గ నగరాశ్రితే, రంగనాయకి భూపుత్రి, కృపే
వరదవల్లభే, కోటి బ్రహ్మాది సంసేవ్యే కోటి రుద్రాది, పద్మద్వయం పూర్ణకుంభం, వరదాభయే,
పాశమంకుశంశంఖం చక్రం, శూలం, కృపాణికాం, ధనుర్భాణౌ, చాక్షమాలాం అష్టాదశభుజే
లక్ష్మీ మహాస్టా దశపీఠగే, పద్మే పద్మాలయే పద్మిని పూర్ణకుంభాభిషేచిచే ఇందిరెందింది,
రాభాక్షి వశీకృతి జగత్పతి, మంగళం మంగళానాంత్వం, దేవతానాం, చదేవతా,
త్వముతమోతమానాం చత్వం శ్రేయః శ్రీ విద్యాక్షేమ కారిణీ,
శ్రీం భీజజసంతు ష్టా ఐం, హ్రీం, శ్రీం బీజ పాలికా, ప్రపత్తి మార్గసులభా,
విష్ణుప్రథమకింకరీ మాంగళ్యాధిదేవతా, శ్రీ షోడశాక్షరీ విద్యా శ్రీ యత్రపురవాసినీ.
సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థసాధకే,
శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే
పునః పునర్నమస్తేస్తుసాష్టాంగమయుతం పునః

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి

శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామావళి 


శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మీ ప్రీత్యర్థం శ్రీ వేంకటేశ మహిషీ మహాలక్ష్మి
చతుర్వింశతి నామభి: శ్రీ వెంకటేశ మహిషీ మహా లక్ష్మిఅర్చన కరిష్యే
అస్య శ్రీ మహాలక్ష్మీ చతుర్వింశతి నామ మంత్రస్య బ్రహ్మా ఋషిః అనుష్టప్ చంధం!
శ్రీ మహాలక్ష్మీ దేవతాః శ్రీ వెంకటేశ మహిషీ శ్రీ మహాలక్ష్మీ ప్రీత్యర్ధే జపే వినియోగః
ధ్యానం
ఈశానం జగతో స్య వెంకట పతే ర్విష్టో: పరాం ప్రేయసీం
తద్వక్షస్స్థల నిత్య వాసరసికాం తత్ కాంతి సంవర్ధినీమ్
పద్మాలంకృతపాణి పల్లవ యుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరం
ఓం శ్రియై నమః       ఓం లోకధాత్రై నమః      ఓం బ్రహ్మమాత్రే నమః      ఓం పద్మనేత్రాయ నమః
ఓం పద్మముఖ్యై నమః        ఓం ప్రసంనముఖ నమః        ఓం పద్మాయై నమః        ఓం పద్మకాంత్యై నమః
ఓం పద్మకాంత్యై నమః       ఓం ప్రసన్నముఖ పద్మాయై నమః        ఓం బోల్వ వనస్థాయై నమః     
ఓం విష్ణు పత్నై నమః        ఓం విచిత్ర క్షౌమధారిన్యై నమః        ఓంపృథు శ్రోన్యై నమః     
ఓం పక్వ బిల్వ ఫలా పీనతుంగ స్తన్యై నమః      ఓం సురక్త పద్మ పత్రాభ నమః       ఓం కరపాదతలాయై నమః
ఓం శుభాయ నమః          ఓం సరత్నాంగత కేయూర నమః         ఓం కాంచీనూపురశోభితాయై నమః
ఓంయక్ష కర్దమ సంలిప్త సర్వాంగాయై నమః         ఓం మంగళ్యాభరనై శ్చితైర్ముక్తాహారై ర్విభూషితాయై నమః
ఓం తాటకై రవతం సైశ్చశోభమాన ముఖాంబుజాయై నమః          ఓం పద్మ హస్తాయై నమః
ఓం హరివల్లభాయై నమః        ఓం ఋగ్యజుస్సామరూపాయై నమః        ఓం విద్యాయై నమః      ఓం అబ్దిజాయై నమః         
ఓం ఏవం చతుర్వింశతి నామభి: బిల్వపత్రై లక్ష్మ్యర్చనం కుర్యత్ తేన సర్వాభీష్ట సిద్ధిర్భవతు
ఇతి చతుర్వింశ తి నామావళి

శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం ....


పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు .ఆ రాజ్యంలోఅందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది.ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి 
ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు . దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .
అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .
ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి

కన్న తల్లిదండ్రులను పూజించే చోట లక్ష్మీదేవి ఉంటుందట!

కన్న తల్లిదండ్రులను పూజించేచోట, మంచి ముత్యాలున్నచోట, తెల్లని వస్త్రాలతో పరిశుభ్రంగా మనుషులు తిరిగే ప్రదేశాల్లో, పాత్రల నిండా నీరు- పాలు ఉన్నచోట, వెండి వస్తువులు, చందనం, వెండి గిన్నెలో పాలు, పెరుగు, మజ్జిగలు ఉన్న ఇంట్లో లక్ష్మి నివసిస్తుంది. ఎక్కడైతే భక్తి ఉంటుందో, ఎక్కడైతే పసుపుపచ్చని పూలు ఉంటాయో, పెద్దలు, గురువులు ఎక్కడయితే పూజలందుకుంటారో అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం చేస్తుంది. నలుగు పిండితో స్నానం చేసే స్త్రీలున్న ఇల్లు, వడపప్పు ప్రసాదంగా పెట్టే ప్రదేశం, శాంత స్వరూపులు, ఎప్పుడూ నవ్వుతూ ఉండే ప్రదేశాలు, బద్ధకం, అశ్లీలత, హింసా ప్రవృత్తులు లేనిచోట ఆమెకు ప్రియప్రదేశాలు. సూర్యుడు ఉదయించే సమయాన్ని చూసేవారికి ఈమె కటాక్షం తప్పక ఉంటుంది. సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రించేవారు అమ్మకు నచ్చరు. అంటే పరిశుభ్రంగా, పరిశుద్ధ సేవా గుణం నిండిన హృదయాలతో ఉండేవారింట లక్ష్మీదేవి కలకలం నివసిస్తుందని పండితులు అంటున్నారు.

Saturday, August 22, 2015

శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం
పూర్వం మగధ సామ్రాజ్యాన్ని గజపతివర్మ అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు .శత్రుదుర్భేధ్యమైన ఆ రాజ్యంలో ప్రజలు సిరిసంపదలతో ,భోగభాగ్యాలతో,అష్టైశ్వర్యాలతో ఏలోటు లేకుండా తులతూగుతుండేవారు . అలా ఉన్నాకూడా! రాజు గజపతివర్మ తన మంత్రి శూరసేనుడుతో కలసి మారువేషంలో రాజ్యంలోతిరిగి ప్రజల యోగక్షేమాలు స్వయంగా తెలుసుకునేవాడు .ఆ రాజ్యంలోఅందరు ధనికులే అయినప్పటికీ శాంతశీల అనే పేదరాలు ఉండేది.ఆమె భర్త రుద్రసేనుడు మహాబలశాలి . ఒక రోజు రాజు ,మంత్రి మారువేషంలోరాజ్యంలోతిరుగుతుండగా ఒక బందిపోటు గుంపు వాళ్ళపై దాడి చేస్తారు రాజు,మంత్రి వాళ్ళతో ప్రతిఘటిస్తుంటారు అటువైపుగా వెళ్ళుతున్న రుద్రసేనుడు అది చూసి తన వంతు సాయం చేస్తాడు .

దానికి మారువేషంలోవున్న రాజు మెచ్చి'' నీకు ఏమి బహుమానం కావాలో కోరుకో'' అని అంటాడు .కాని రుద్రసేనుడు ''తమరు ఆపదలో ఉంటే కాపాడానేగాని ఏదో ఆశించి మాత్రం కాదు'' అని వీరోచితంగా అంటాడు . దానికి రాజు సంతోషించి ''నీకు ఎప్పుడు ఏ సాయం కావాలన్న తనని కోరమని ''చెప్పి వెళ్ళిపోతాడు .ఇదంతా తన భార్య శాంతశీలకు చెబుతాడు రుద్రసేనుడు .అప్పుడు ఆమెకు ఒక విషయం గుర్తుకు వస్తుంది .అదేమిటంటే కొద్ది రోజులక్రితం తను కట్టేలకని అడవిలోకివెళ్ళినప్పుడు అక్కడ ఒక మునీశ్వరుడు తారసపడతాడు .అప్పుడు తను తన పేదరికం గురించి చెప్పినపుడు .ఆ మునీశ్వరుడు ''తల్లి ఒకవిషయం చెబుతాను శ్రద్దగా విను . లోకమంతా చీకటిగా అది కూడా శ్రుక్రవారం రోజు ఎవరి ఇంట్లోను దీపం లేకుండావుండి ని ఇంట్లో మాత్రం దీపం పెట్టి గుమ్మానికి అడ్డంగా కూర్చో అప్పుడు చీకటిని భరించలేక నల్లని చీర ధరించిన ఒకామే నీ ఇంట్లో నుంచి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ౦ది అప్పుడు నువామేని అడ్డగించి బయట వెళ్ళితే లోపలికి రాకుడదని షరతు విధించు అప్పుడామె నేను లోపల వుండే ఈ వెలుగుని భరించలేను చీకటిలోకి వెళ్ళిపోతానంటుంది.ఇంకొకామే పట్టుపితాంబరాలతో ధగధగామెరిసే నగలతో ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది అమెనికుడా అడ్డగించి లోపలికి వెళ్ళితే బయటకు వెళ్ళకూడదు అని షరతు విధించు అమె అప్పుడు బయటి చీకటిని భరించలేను లోపలికి వెళ్ళిపోతానంటు౦ది .ఆమె ఇంట్లోకి ప్రవేశించగానే నీవు ఐశ్వర్యవంతురాలవు అవుతావని ''మునీశ్వరుడు చెప్పినది గుర్తుకువస్తుంది . వెంటనే శాంతశీల రాజు వద్దకు వెళ్ళి తాను ఎవరో చెప్పి వచ్చే శుక్రవారం రాజ్యంలో ఎవరి ఇంట్లోను దీపం పెట్టకుండా ఉండేలా చూడాలని కోరుతుంది .వెంటనే రాజు ఆమె కోరిక మేరకు రాజ్యంలోఎవరు శుక్రవారంరోజు దీపం పెట్టకూడదని చాటింపు వేయిస్తాడు. మునీశ్వరుడు చెప్పినట్లు చేసి శాంతా శీల ఐశ్వర్యవంతురాలవుతుంది కాని శుక్రవారం ఎవరూ దీపం పెట్టకుండా రాజుగారితో ఆజ్ఞ వేయిచినందుకు చాలా బాధపడుతూ వుంటుంది అప్పుడు లక్ష్మీదేవిని ప్రార్ధించగా లక్ష్మీదేవి ప్రసన్నురాలై ''ఇకపై ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో దీపం పెడతారో వారందరి ఇళ్లకు నేను వస్తాను ''అని వరం ప్రాసాదిస్తుంది . ఎవరైతే ప్రతి శుక్రవారం సంధ్యాసమయంలో తప్పకుండా దీపం వెలిగిస్తారో వారు శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షానికి పాత్రులవుతారు .